Murder Movie: వర్మకు కోర్టు షాక్.. ‘మర్డర్’‌కు బ్రేక్

తెలంగాణ నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన పెరుమాల్ల ప్రణయ్ పరువు హత్య ( Pranay murder ) తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. అయితే వాస్తవ ఘటన ఆధారంగా  వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ( Ram Gopal Varma ) ‘మర్డర్’ ( MURDER Movie ) సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

Last Updated : Aug 24, 2020, 04:08 PM IST
Murder Movie: వర్మకు కోర్టు షాక్.. ‘మర్డర్’‌కు బ్రేక్

Ram Gopal Varma's Murder Movie stopped: హైదరాబాద్: తెలంగాణ నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన పెరుమాల్ల ప్రణయ్ పరువు హత్య ( Pranay murder ) తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. అయితే వాస్తవ ఘటన ఆధారంగా  వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ( Ram Gopal Varma ) ‘మర్డర్’ ( MURDER Movie ) సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని ఆపాలంటూ హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృత, ఆయన తండ్రి బాలస్వామి జూలై 29న నల్లగొండ జిల్లా కోర్టులో సివిల్ పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే అంతకు ముందు మర్డర్ సినిమా దర్శక నిర్మాతలకు నోటీసులు సైతం జారీ చేసింది కోర్టు. అయితే ఈ పిటిషన్‌ను సోమవారం విచారించిన నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు మర్డర్ సినిమాను నిలిపివేయాలంటూ.. మధ్యంతర ఉత్వర్వులు జారీ చేసింది. Also read: RGV Murder song: పిల్లల్ని ప్రేమించడం తప్పా..?

అయితే.. తమ కుటుంబాన్ని సంప్రదించకుండా ఫొటోలను వాడుకుంటూ.. తమ కులాన్ని కించపరిచేలా వర్మ ఈ సినిమాను తీస్తున్నారని, ఈ సినిమా వల్ల కేసు పక్కదారి పడుతుందని అమృత, ప్రణయ్ తండ్రి బాలస్వామి కోర్టులో విన్నవించారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి మర్డర్ సినిమాను నిలిపివేయాలంటూ.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అయితే నల్లగొండ జిల్లా కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై హైకోర్టును ఆశ్రయిస్తామని వర్మ తరపు న్యాయవాది పేర్కొన్నారు. Also read: Murder Songs: నచ్చినోన్ని ప్రేమించడం తప్పా? సాంగ్ రిలీజ్ చేసిన RGV

Trending News