AP New Districts: ఏపీలో మార్చి 18 నాటికి కొత్త జిల్లాలు... ఏప్రిల్ 2 నుంచి కార్యకలాపాలు..
Andhra Pradesh New Districts: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ మార్చి 18 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. తుది నోటిఫికేషన్ మార్చి 15-17 మధ్య జారీ చేసే అవకాశం ఉంది.
Andhra Pradesh New Districts: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన సర్కార్.. ఆ ప్రక్రియను మార్చి 18 నాటికి పూర్తి చేయాలని భావిస్తోంది. అందుకు అనుగుణంగా కసరత్తులు ముమ్మరం చేసింది. మార్చి 15-17 నాటికి జిల్లాల ఏర్పాటుపై తుది నోటిఫికేషన్ జారీ చేయనుంది. మార్చి 18న జిల్లా కలెక్టర్లు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. ఏప్రిల్ 2 నాటికి కొత్త జిల్లాల్లో కార్యకలాపాలు ప్రారంభమవుతాయి.
తుది నోటిఫికేషన్ తర్వాత కొత్త జిల్లాలకు ఉద్యోగులు, అధికారుల కేటాయింపు, మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం ఫోకస్ చేయనుంది. ప్రస్తుతం ఆయా జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలుగా విధులు నిర్వర్తిస్తున్నవారిని అక్కడే కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన నోటిఫికేషన్, సవరణ ఉత్తర్వులపై మార్చి 3 వరకు ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. మార్చి 10 వరకు వీటిని పరిశీలించి.. తుది నివేదిక రూపొందిస్తారు.
సచివాయలంలో బిజినెస్ నిబంధనలు రూపొందించేవారు ఆ నివేదికను పరిశీలించాక.. మార్చి 15-17 మధ్య తుది నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అందుకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడంతో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తవుతుంది. ఏప్రిల్ 2 నుంచి కొత్త జిల్లాల కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
కాగా, పరిపాలనా సౌలభ్యం కోసం ఏపీలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 26కి పెంచుతూ ఏపీ ప్రభుత్వం గత నెలలో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ప్రతీ లోక్‌సభ నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రం చేస్తామని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం జగన్ జిల్లాల పునర్వ్యవస్థీకరణను చేపట్టారు.
Also Read: Vijayawada: సవతి తండ్రి నీచపు పని.. బాలిక స్నానం చేస్తుండగా సీక్రెట్‌గా వీడియో...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook