AP Parishad Election 2021: ఏపీలో కొనసాగుతున్న పరిషత్ ఎన్నికలు, పోలింగ్ కేంద్రాలకు ఓటర్ల క్యూ
AP Parishad Election 2021 Live Updates: మొత్తం 515 జెడ్పీటీసీ, 7,220 ఎంపీటీసీ స్థానాలకు నేటి ఉదయం 7 గంటలకు ఏపీ వ్యాప్తంగా పోలింగ్ ప్రారంభమైంది. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు నేటి ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు.
AP Parishad Election 2021: ఆంధ్రప్రదేశ్‌లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 515 జెడ్పీటీసీ, 7,220 ఎంపీటీసీ స్థానాలకు నేటి ఉదయం 7 గంటలకు ఏపీ వ్యాప్తంగా పోలింగ్ ప్రారంభమైంది. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు నేటి ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియనుంది. 7735 స్థానాలకుగానూ మొత్తం 20,840 అభ్యర్థులు ఏపీ పరిషత్ ఎన్నికల బరిలో నిలిచారు.
ఏజెన్సీ మండలాల్లో మధ్యాహ్నం 2 గంటలకు పోలింగ్ నిలిపివేయనున్నారు. మొత్తం 27,751 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 47 శాతం సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్నాయి. పోలింగ్ ప్రక్రియ పర్యవేక్షణలో భాగంగా 1,972 మంది జోనల్ అధికారులు, 6524 మంది పరిశీలకులు విధులు నిర్వహిస్తున్నారు. అనంతపురం జిల్లాలోని 62 జడ్పీటీసీ స్థానాలు, 782 ఎంపీటీసీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికలలో ఉదయం 8 గంటల వరకు 3.29 శాతం పోలింగ్ నమోదైంది. సింగిల్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేయడంతో పరిషత్ ఎన్నికల(AP Parishad Elections)కు లైన్ క్లియర్ అయింది.
Also Read: Gold Price Today 08 April 2021: బులియన్ మార్కెట్‌లో పెరిగిన బంగారం ధరలు, వెండి ధరలు పైపైకి
పశ్చిమ గోదావరి జిల్లాలోని 45 జెడ్పీటీసీ ,790 ఎంపీటీసీ స్థానాలకు పొలింగ్ జరుగుతోంది. పెదవేగి మండలంలోని సమస్యాత్మక ప్రాంతమైన దుగ్గిరాలలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వేసవి కావడంతో ఉదయమే ఓటు వేసేందుకు పొలింగ్ కేంద్రాలకు భారీ సంఖ్యలో చేరుకుని ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం రూరల్ మండలం సాకుర్రు గున్నేపల్లి పోలింగ్ బూత్లోని బ్యాలెట్ పత్రాలపై జనసేన(Janasena Party) పార్టీ గుర్తు లేకపోవడంతో అభ్యర్థులు ఆందోళనకు దిగారు. జనసేన నాయకులు, కార్యకర్తలు అధికారులపై ఘర్షణకు దిగడంతో
పోలింగ్ ప్రక్రియను నిలిపివేశారు.
Also Read: AP Parishad Elections: ఏపీలో పరిషత్ ఎన్నికలకు హైకోర్టు డివిజన్ బెంచ్ గ్రీన్ సిగ్నల్
కాగా, పరిషత్ ఎన్నికల నిర్వహణపై ఏపీ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ తన వాదనలు వినిపించారు. టీడీపీ, బీజేపీ, జనసేన విపక్షాలు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించి సింగిల్ బెంచ్ జెడ్పీటీసీ, ఎంసీటీసీ ఎన్నికలను తాత్కాలికంగా నిలిపివేసిందని డివిజన్ బెంచ్‌కు తెలిపారు. అయితే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 28 రోజుల ఎన్నికల కోడ్ నిబంధన అమలు చేయడం తప్పనిసరి కాదని హైకోర్టు డివిజన్ బెంచ్‌కు తెలిపారు. నేటి ఉదయం వాదనలు విన్న డివిజన్ మధ్యాహ్నానికి విచారణ వాయిదా వేసింది. మధ్యాహ్నం మరోసారి విచారణ చేపట్టిన హైకోర్టు డివిజన్ బెంచ్ పరిషత్ ఎన్నికల(AP Parishad Elections 2021)ను నిలిపివేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కొట్టివేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook