AP Heavy Rains Alert: ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండ్రోజులు భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడటం,  ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతుండటం దీనికి కారణంగా తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పశ్చిమ బంగాళాఖాతంలో(Bay of Bengal) ఏర్పడిన అల్పపీడనం మహారాష్ట్రలో బలహీనపడింది. మరోవైపు అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉన్న అల్పపీడన(Low Depression) ద్రోణి కూడా సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తులో స్థిరంగా ఉంది. ఈ ప్రభావంతో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. రాష్ట్రంలో 13 జిల్లాల్లో సగటున 2.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రానున్న రెండ్రోజుల్లో కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, చాలాచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. రాయలసీమలోని కొన్నిప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయి. ఉత్తరాంధ్రతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాలో 1-2 ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది.


రాష్ట్రంలో అత్యధికంగా విజయనగరం జిల్లాలో 9.9 మిల్లీమీటర్లు, శ్రీకాకుళంలో 9 మిల్లమీటర్ల వర్షం కురిసింది. విశాఖపట్నంలో 5.6 మిల్లీమీటర్లు, కృష్ణాలో 5, తూర్పు గోదావరిలో 4.9, పశ్చిమ గోదావరి జిల్లాలో 4.2, ప్రకాశం జిల్లాలో 2.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రానున్న రెండ్రోజులు కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు(Heavy Rains)పడనున్నాయి.


Also read: AP Corona Vaccination: వ్యాక్సినేషన్‌లో 3 కోట్ల మైలురాయి దాటిన ఆంధ్రప్రదేశ్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook