AP Temperatures: ఆంధ్రప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు అతివేగంగా పడిపోతున్నాయి. ఈశాన్యం నుంచి బలంగా వీస్తున్న గాలులు, అకాల వర్షాల కారణంగా చలి విపరీతంగా పెరుగుతోంది. మరోవైపు ఉదయం వేళల్లో భారీగా పొగమంచు పడుతోంది. ( Low Temperatures and heavy snowfall in andhra pradesh)


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి..దక్షిణ తమిళనాడు నుంచి రాయలసీమ వరకూ విస్తరించి ఉంది. సముద్రమట్టానికి 9 వందల మీటర్ల ఎత్తు వరకూ ఉండటంతో..తక్కువ ఎత్తు నుంచే బలమైన గాలులు వీస్తున్నాయి. మరోవైపు ఇటీవల కురిసిన అకాల వర్షాలు. దాంతో ఉదయం వేళల్లో చలిగాలులు పెరిగిపోయాయి. అటు తెల్లవారుజాము నుంచి భారీగా పొగమంచు ఎక్కువవుతోంది. 


రాష్ట్రంలో అల్పపీడనం ఉన్నప్పటికీ కోస్తాంధ్రలో వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఇవాళ వాతావరణం పొడిగా ఉంటుంది. దక్షిణ కోస్తాంధ్రలో స్వల్పపాటి వర్షాలు పడవచ్చు. అకాల వర్షాల కారణంగానే ఇటీవల ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. దీనికితోడు పొగమంచు అధికంగా ఉంటోంది. విశాఖపట్నం ఏజెన్సీలో మరోసారి రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. చింతపల్లిలో 4.5 డిగ్రీలు నమోదైంది. ఈ సీజన్‌లో ఇదే అత్యల్పం. విశాఖపట్నంలో 16 డిగ్రీలు, శ్రీకాకుళం, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో 17 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక రాజమండ్రిలో 18 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా. విజయవాడలో 19.5 డిగ్రీలు నమోదైంది.


మరోవైపు పొగమంచు కారణంగా విమానాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతోంది. విజయవాడ విమానాశ్రయంలో పొగమంచు కారణంగా రన్‌వే కన్పించకపోవడంతో చాలాసేపు గాలిలో చక్కర్లు కొట్టిన ఎయిర్ ఇండియా విమానం..తిరిగి హైదరాబాద్‌కు పయనమైంది. 


Also read: Ayyanna Panthulu: మహా కామేశ్వరి పీఠం వ్యవస్థాపకుడు అయ్యన్న పంతులు కన్నుమూత


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook