Heavy Rains: మరింత బలపడిన అల్పపీడనం.. 24 గంటల్లో ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..

Heavy Rains In Andhra Pradesh: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. ఉపరితల ఆవర్తనంతో కొనసాగుతుంది. రానున్న 24 గంటల్లో ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీఎస్‌డీఎంఏ హెచ్చరించింది.  ముఖ్యంగా చిత్తూరు, ఏలూరులో కూడా భారీ వర్షాలు రెండు రోజులుపాటు ఉంచవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది.
 

1 /7

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఇది ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలపై తీవ్రంగా ఉంటుందని తెలిపింది.  

2 /7

24 గంటలపాటు ఈ బలపడిన అల్పపీడనం వల్ల భారీ వర్షాలు కురుస్తాయి. కోస్తా, ఉత్తర ఆంధ్రప్రదేశ్‌ దిగా ఈ అల్పపీడనం పయనిస్తుంది. దీని ప్రభావం వల్ల నేడు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయి.  

3 /7

ఇక ఎన్టీఆర్‌, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో మత్స్యకారులను కూడా వేటకు శనివారం వరకు వెళ్లకూడదని హెచ్చరించింది.  

4 /7

తమిళనాడు గుండా ఈ అల్పపీడనం తీరం దాటే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఎల్లుండి వరకు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తాయి. వరికోతలకు వెళ్లే రైతులు కూడా అలెర్ట్‌గా ఉండాలని సూచనలు చేశారు.  

5 /7

తీర ప్రాంత ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ప్రభుత్వం చర్యలు కూడా తీసుకుంది. ఇక భారీ వర్షాల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ముందస్తు స్కూళ్లకు సెలవులు కూడా ప్రకటిస్తున్నాయి. మరోవైపు తెలంగాణలో కూడా చలి తీవ్రత విపరీతంగా పెరిగింది.  

6 /7

ముఖ్యంగా సాయంత్రం త్వరగా చీకటి పడటంతోనే చలిగాలుల తీవ్రత కూడా పెరిగింది. ఉదయం కూడా మంచు మబ్బులు కమ్మేస్తున్నాయి. ఎముకలు కొరికే చలి వేధిస్తోంది. ఉదయం 8 గంటలకు దాటిన తర్వాత కూడా మబ్బులు తొలిగే పరిస్థితి లేదు. వాహనదారులు డ్రైవింగ్‌ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి.  

7 /7

ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఈ చలిగాలుల సమయంలో ఆరోగ్యంపై జాగ్రత్తలు తగిన విధంగా తీసుకోవాలని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కేవలం వేడిగా వండిన ఆహారం మాత్రమే తీసుకోవాలి. సీజనల్‌ జబ్బులు రాకుండా తగిన ఆరోగ్య జాగ్రత్తలు కూడా తీసుకోవాలని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది.