ఏపీలో తాజాగా 80 కరోనా కేసులు, ఒక్క జిల్లాలోనే 33 కేసులు
కరోనా ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ, ఏపీ ఉన్నాయి. అయితే గత మూడు రోజులుగా తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టగా, ఏపీలో మాత్రం పెరిగిపోతున్నాయి.
కరోనా ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ, ఏపీ ఉన్నాయి. అయితే గత మూడు రోజులుగా తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టగా, ఏపీలో మాత్రం పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు కరోనా మరణాలు పెరిగిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో జరిగిన కోవిడ్19 పరీక్షల్లో 80 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సైకిల్‌పై 3వేల కి.మీ.. హైదరాబాద్‌లో పంక్చర్!
రాష్ట్రంలో నమోదైన మొత్తం 1177 పాజిటివ్ కేసులకుగాను చికిత్స అనంతరం కరోనా నుంచి కోలుకుని 235 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో ఇప్పటివరకూ కరోనా సోకడంతో 31 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 911 అని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాక తెలిపింది. ఈ మేరకు సోమవారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. Photos: కబాలి బ్యూటీ లేటెస్ట్ ఫొటోలు
[[{"fid":"184874","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Image Credit: twitter/@ArogyaAndhra","field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Image Credit: twitter/@ArogyaAndhra","field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"alt":"Image Credit: twitter/@ArogyaAndhra","class":"media-element file-default","data-delta":"1"}}]]
TRS ఆవిర్భావ దినోత్సవం.. కేటీఆర్ రక్తదానం
ఇప్పటివరకూ రాష్ట్రంలో కర్నూలు, గుంటూరు జిల్లాలోనే 200కు పైగా బాధితులుండగా.. తాజాగా కృష్ణా జిల్లాలోనూ ఆ మార్క్ దాటింది. కృష్ణా జిల్లాలో తాజాగా 33 పాజిటివ్ కేసులు రావడం కలకలం రేపుతోంది. జిల్లాలవారీగా చూస్తే కర్నూలులో 292 కేసులు, గుంటూరులో 237 కేసులు, కృష్ణాలో 210 మందికి కరోనా సోకింది. విజయనగరం జిల్లాలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కాకపోవడం గమనార్హం. ఇటీవల కరోనా మహమ్మారి శ్రీకాకుళం జిల్లాకు పాకిన విషయం తెలిసిందే. అక్కడ నలుగురు కరోనా బాధితులున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!