AP: తాజాగా 7,738 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో కరోనావైరస్ ( Coronavirus ) కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. అయితే కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో పదివేలకు తక్కువగా కేసులు నమోదవుతున్నాయి.
Andhra Pradesh Covid-19 updates: అమరావతి: ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో కరోనావైరస్ ( Coronavirus ) కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. అయితే కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో పదివేలకు తక్కువగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా.. గత 24గంటల్లో ( శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9గంటల వరకు ) 70,455 శాంపిళ్లను పరీక్షించగా.. 7,738 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా ఈ 24గంటల్లో 57 ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్యఆరోగ్యశాఖ ( AP Health Ministry ) ఆదివారం సాయంత్రం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన కేసులతో.. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,25,514 కి చేరగా.. ఇప్పటివరకు ఈ మహమ్మారితో 5,359 మంది మరణించారు. Also read: Narendra Modi: 7 రాష్ట్రాల సీఎంలతో మోదీ సమావేశం..!
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 78,836 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉండగా.. ఇప్పటివరకు 5,41,319 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 51,04,131 కరోనా నమూనాలను పరీక్షించినట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. అంతేకాకుండా గడచిన 24 గంటల్లో 10,608 మంది కోలుకున్నట్లు వెల్లడించింది. ఇదిలాఉంటే.. జిల్లాల వారీగా కరోనా కేసులు, మరణాల వివరాలు ఇలా ఉన్నాయి..
[[{"fid":"193517","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"andhra-pradesh-coronavirus-bulletin","field_file_image_title_text[und][0][value]":"ఆంధ్రప్రదేశ్ కరోనావైరస్ కేసులు"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"andhra-pradesh-coronavirus-bulletin","field_file_image_title_text[und][0][value]":"ఆంధ్రప్రదేశ్ కరోనావైరస్ కేసులు"}},"link_text":false,"attributes":{"alt":"andhra-pradesh-coronavirus-bulletin","title":"ఆంధ్రప్రదేశ్ కరోనావైరస్ కేసులు","class":"media-element file-default","data-delta":"1"}}]]