AP: రాష్ట్రంలో 30 లక్షలు దాటిన పరీక్షలు, దేశంలో టాప్
కోవిడ్ 19 నిర్ధారణ పరీక్షల్లో ( covid19 tests ) ఆంధ్రప్రదేశ్ మరో ఘనత సాధించింది. దేశంలోనే అత్యధికంగా పరీక్షలు చేస్తున్న రాష్ట్రంగా ఖ్యాతి దక్కించుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( cm ys jagan ) ప్రత్యేక దృష్టి పెట్టడంతో ఇప్పటివరకూ రాష్ట్రంలో పరీక్షల సంఖ్య 30 లక్షలు దాటింది.

కరోనా ( Corona ) నిర్ధారణ పరీక్షల్లో ఏపీ ముందంజలో ( Ap top in corona tests ) ఉంది. రాష్ట్ర జనాభాలో ఇప్పటివరకూ 5.56 శాతం మందికి పరీక్షలు నిర్వహించారు. ప్రతి పది లక్షల జనాభాకు 56 వేల 541 పరీక్షలతో దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. రోజుకు సరాసరిన 50 వేల పరీక్షలు చేస్తూ ముందుకుపోతోంది ఏపీ. ఇప్పటివరకూ రాష్ట్రంలో 30 లక్షల 19 వేల 296 టెస్టులు జరిగినట్టు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
గత 24 గంటల్లో 57 వేల 685 మందికి పరీక్షలు నిర్వహించగా..9 వేల 742 మందికి పాజిటివ్ గా తేలింది. మొత్తం కేసుల సంఖ్య 3 లక్షల 16 వేలకు చేరుకోగా..2 లక్షల 26 వేల మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 86 వేల యాక్టివ్ ( Active cases ) కేసులున్నాయి. గత 24 గంటల్లో 8 వేల మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
Also read: Ap Capital issue: కేసు మరో బెంచ్ కు బదిలీ చేసిన సుప్రీంకోర్టు