AP SSC Exams Postponed: ఏపీలో వాయిదా పడనున్న పదవ తరగతి పరీక్షలు, రేపు కొత్త షెడ్యూల్ విడుదల
AP SSC Exams Postponed: ఆంధ్రప్రదేశ్‌లో పదవ తరగతి పరీక్షలు వాయిదా పడనున్నాయని తెలుస్తోంది. ఇంటర్మీడియట్ పరీక్షల తేదీల కారణంగా..సెక్యూరిటీని దృష్టిలో ఉంచుకుని వాయిదా వేయాలని నిర్ణయించినట్టు సమాచారం.
AP SSC Exams Postponed: ఆంధ్రప్రదేశ్‌లో పదవ తరగతి పరీక్షలు వాయిదా పడనున్నాయని తెలుస్తోంది. ఇంటర్మీడియట్ పరీక్షల తేదీల కారణంగా..సెక్యూరిటీని దృష్టిలో ఉంచుకుని వాయిదా వేయాలని నిర్ణయించినట్టు సమాచారం.
ఏపీలో పదవ తరగతి పరీక్షల తేదీ కూడా మారవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే జేఈఈ మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ కారణంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ఏప్రిల్ 7 నుంచి ప్రారంభం కావల్సి ఉండగా..ఏప్రిల్ 22వ తేదీ నుంచి మే 12 వరకూ వాయిదా పడ్డాయి. పదవ తరగతి పరీక్షలు మే 2వ తేదీ నుంచి 13 వరకూ జరగనున్నాయి. ఇప్పుడు పదవ తరగతి పరీక్షల్ని మే 9 నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ మారడంతో పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ కూడా మార్చక తప్పని పరిస్థితులేర్పడ్డాయి.
ఇటు ఇంటర్మీడియట్..అటు పదవ తరగతి పరీక్షల్ని ఒకేసారి నిర్వహిస్తే ప్రశ్నాపత్రాలకు పోలీస్ భద్రత, ఆరోగ్య సిబ్బంది, పరీక్షా కేంద్రాల కేటాయింపు వంటి సమస్యలు ఎదురయ్యే పరిస్థితి ఉంది. ఈ నేపధ్యంలో పదవ తరగతి పరీక్షల్ని వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారు. పదవ తరగతి పరీక్షల కొత్త షెడ్యుల్ రేపు విడుదల కానుంది. పదవ తరగతి పరీక్షలు ఏడు రోజులే ఉన్నందున..ప్రతి పరీక్షకు మధ్య 1-2 రోజులు విరామం ఉండవచ్చు.
Also read: Andhra pradesh: ఏపీలో ఐఏఎఎస్ అధికారుల బదిలీలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook