AP New Districts: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు ఖరారైంది. రాష్ట్రం 26 జిల్లాలుగా విభజితం కానుంది. ఏపీలో కొత్త జిల్లాల ప్రక్రియ ఎలా ఉండబోతుంది, ఎప్పటికి పూర్తవుతుంది, నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల కానుందనేది తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2019 ఎన్నికల మేనిఫెస్టోలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన మరో హామీ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా ఏర్పాటు చేయడం. వాస్తవానికి ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కావల్సి ఉండగా. కరోనా మహమ్మారి కారణంగా ఆలస్యమవుతూ వస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి కీలకమైన ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. ఆ జిల్లాలు ఎలా ఉండబోతున్నాయనేది ఇప్పుడు తెలుసుకుందాం. దీనికి సంబంధించిన అంటే కొత్త జిల్లాల నోటిఫికేషన్ మాత్రం ఇవాళో..రేపో విడుదల కానుంది.


రాష్ట్రంలో ప్రస్తుతం 13 జిల్లాలున్నాయి 25 లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి. ప్రతి లోక్‌సభ ఒక  జిల్లాగా మారితే 25 జిల్లాలు ఏర్పాటు కావల్సి ఉంటుంది. అయితే..అరకు లోక్‌సభ భౌగోళికంగా చాలా పెద్దదిగా ఉండటంతో ఆ ఒక్క నియోజకవర్గాన్ని రెండు జిల్లాలుగా చేయనున్నారు. అంటే గిరిజన జిల్లాలు రెండు ఏర్పడనున్నాయి. ఇవి కాకుండా అక్కడక్కడా భౌగోళికంగా చిన్న చిన్న మార్పులు, చేర్పులు ఉండనున్నాయి. అంతేకాకుండా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పూర్తిగా ఏదో ఒక జిల్లాగా ఉండేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 


రాష్ట్రంలో కొత్త జిల్లాల పునర్ వ్యవస్థీకరణను ప్రభుత్వం అత్యంత శాస్త్రీయంగా అధ్యయనం చేసింది. వివిధ శాఖల అధికారులతో నాలుగు సబ్ కమిటీల్ని ఏర్పాటు చేసి..జిల్లాల ఏర్పాటు ఎలా ఉండాలి, సరిహద్దుల నిర్ధారణకు ప్రామాణికాలేంటి, సాంకేతిక సమస్యలు ఎలా ఉంటాయనే అంశాలపై చర్చ సాగింది. విస్తృత అధ్యయనం తరువాతే ప్రతిపాదనలు సిద్దమయ్యాయి. ఇప్పుడున్న 13 జిల్లాల స్థానంలో  26 జిల్లాలు ఏర్పడనున్నాయి.


ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కొత్త జిల్లాల (Ap New Districts) ఏర్పాటుకై రెవిన్యూ శాఖ ముందుగా ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేయనుంది. సూచనలు, సలహాలకై నెల రోజుల గడువుంటుంది. సూచనలు, సలహాల్ని పరిశీలించి..అవసరమైతే మార్పులు, చేర్పులు చేస్తారు. ఆ తరువాత తుది నోటిఫికేషన్ విడుదలవుతుంది. కొత్త జిల్లాల ఏర్పాటు ఎప్పట్నించి అమలవుతుందనేది ఆ నోటిఫికేషన్‌లో స్పష్టంగా ఉంటుంది. ఆ తరువాత కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర జిల్లా స్థాయి అధికారుల నియామకం ఉంటుంది. ఉగాదికి తుది నోటిఫికేషన్ ఉండేలా..ఇవాళో, రేపో ప్రాథమిక నోటిఫికేషన్(Primary Notification)వెలువడనుంది.


Also read: AP Corona Cases Today: ఏపీలో మళ్లీ పెరిగిన కొవిడ్ ఉద్ధృతి.. 15 వేలకు చేరువలో కరోనా కేసులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook