Low Depression Alert: మళ్లీ వాయుగుండం, ఈసారి ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్షాల ముప్పు తప్పదు
Low Depression Alert: ఫెంగల్ తుపాను ప్రభావం తగ్గిందో లేదో మరో ముప్పు ముంచుకొస్తోంది. ఈ నెలలోనే నైరుతి బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడనుంది. తుపానుగా మారనుందా లేదా, ఏయే జిల్లాలకు భారీ వర్షాల ముప్పుందో తెలుసుకుందాం.
Low Depression Alert: నైరుతి బంగాళాఖాతంలో ఫెంగల్ తుపాను బలహీనపడుతోంది. క్రమంగా అరేబియా సముద్రం దిశగా కదులుతోంది. ఫెంగల్ తుపాను ప్రభావం ఏపీపై పెద్దగా లేకున్నా ఈసారి మరో ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ సూచించింది. బంగాళాఖాతంలో ఈ నెల రెండో వారంలో మరో అల్పపీడనం ఏర్పడి వాయుగుండంగా మారనుందని ఐఎండీ వెల్లడించింది.
ఇప్పుడిప్పుడే ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలు ఫెంగల్ తుపాను నుంచి కోలుకుంటున్నాయి. తుపాను ప్రభావం ఏపీపై అంతగా లేకపోయినా పుదుచ్చేరి, తమిళనాడులో భారీగా కన్పించింది. ఏపీలో అయితే నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, బాపట్ల జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. నెల్లూరు జిల్లా కసుమూరులో అత్యధికంగా 7.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆత్మకూరు, నెల్లూరు రూరల్, మర్రిపాడు, అనంతసాగరం మండలాల్లో భారీ వర్షాలు పడ్డాయి. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుపాను పుదుచ్చేరి వద్ద బలహీనపడి వాయుగుండంగా మారింది. ఇప్పుడు అరేబియా సముద్రం దిశగా కదులుతూ అల్పపీడనంగా మరింతగా బలహీనపడనుంది. ఇవాళ సాయంత్రానికి ఫెంగల్ తుపాను ప్రభావం పూర్తిగా తగ్గనుంది. దక్షిణ కోస్తాంధ్రలో ఇవాళ మోస్తరు వర్షాలు పడవచ్చు. ఉత్తరాంధ్రలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడనున్నాయి.
మళ్లీ వాయుగుండం ముప్పు
ఫెంగల్ తుపాను సద్దుమణిగేలోగా మరో ముప్పు ముంచుకొస్తోంది. నైరుతి బంగాళాఖాతంలోనే మరో అల్పపీడనం ఏర్పడనుందని ఐఎండీ వెల్లడించింది. ఈ అల్పపీడనం ఈ నెల రెండో వారంలో ఏర్పడవచ్చు. ఇది వాయుగుండంగా బలపడనుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే తుపానుగా మారుతుందా లేదా అనేది మరో వారం రోజుల్లో తెలస్తుంది. ఈ వాయుగుండం ప్రభావం దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలపై ఎక్కువగా ఉండనుంది. అటు తెలంగాణలో కూడా ఈ నెల 8 వరకూ మోస్తరు వర్షాలు పడనున్నాయి.
Also read: Interest Free Loan: మహిళలకు కేంద్రం గుడ్‌న్యూస్, 5 లక్షల వడ్డీ రహిత రుణాలు, ఎలాగంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.