AP Heavy Rains: ఏపీలోని ఈ జిల్లాలకు మళ్లీ వర్షసూచన, 48 గంటల్లో భారీ వర్షాలు
AP Heavy Rains: ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి వర్షసూచన జారీ అయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడటంతో రానున్న 48 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Heavy Rains: ఏపీకు వర్షసూచన ఇంకా తొలగలేదు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతానికి బలహీనపడింది. ఈ ప్రభావంతో వచ్చే రెండ్రోజులు ఏపీలోని ఈ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ తెలిపింది. ఇప్పటికే దక్షిణ కోస్తా జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది.
అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. ముఖ్యంగా అనంతపురం, సత్యసాయి, వైఎస్ఆర్ కడప, చిత్తూరు, తిరుపతి , నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదు కాగా రానున్న 48 గంటల్లో కూడా ఇదే ప్రభావం కన్పించనుంది. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంత జిల్లాల్లో ఇవాళ, రేపు అధిక వర్షపాతం నమోదు కావచ్చు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో పిడుగులు పడే ప్రమాదముంది. దక్షిణ కోస్తా తీరంలోని ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షం పడే సూచన ఉంది. ఇక నంద్యాల, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి.
వైఎస్ఆర్ కడప, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ఓ వైపు చలికాలం ప్రారంభం కావడంతో వర్షాల కారణంగా చలి తీవ్రత పెరిగింది.
Also read: Ram Murthy Naidu: తమ్ముడి పార్థీవ దేహంతో సొంతూరికి ఏపీ సీఎం చంద్రబాబు.. నేడు అంత్యక్రియలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.