Cyclone Alert: నైరుతి బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి దక్షిణ కోస్తా, తమిళనాడు జిల్లాల్ని కుదిపేసింది. భారీ వర్షాలు ముంచెత్తాయి. ఇప్పుడు మరోసారి భారీ వర్షాలు ముంచెత్తనున్నాయని ఐఎండీ సూచించింది. వచ్చే రెండు రోజుల్లో ఏర్పడనున్న అల్పపీడనం వాయుగుండంగా మారనుందనే హెచ్చరిక జారీ అయింది. అనంతరం తుపానుగా మారుతుందా లేదా అనేది ఇంకా తేలాల్సి ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బంగాళాఖాతంలో ఉత్తర అండమాన్ ప్రాంతంలో ఇవాళ ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. ఇది కాస్తాఈ నెల 22 నాటికి అల్పపీడనంగా మారనుంది ఆ తరువాత 24 వతేదీకు వాయుగుండంగా మారుతుంది. వాయువ్య దిశగా ముందుకు కదులుతూ ఆంధ్రప్రదేశ్- ఒడిశా-పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటేలోగా తుపానుగా మారుతుందా లేదా అనేది ఇంకా స్పష్టత రావల్సి ఉంది. దాంతో ఈ నెల 22 నుంచి ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ఇటీవల ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. ఈసారి ఉత్తర, మధ్య కోస్తా జిల్లాలకు భారీ వర్షాలు పొంచి ఉన్నాయి. ఇవాళ, రేపు చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్సార్ కడప, సత్యసాయి, అనంతపురం, నంద్యాల, కర్నూలు, పల్నాడు, ఎన్టీఆర్, ఏలూరు, గుంటూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి.


ఇప్పటికే కొన్ని తీర ప్రాంతాల్లో సముద్రపు నీరు చొచ్చుకొస్తోంది, కాకినాడ సమీపంలో ఉప్పాడ వద్ద గోడ కోతకు గురైంది. సముద్ర కెరటాలు వేగంగా తీరంవైపుకు వస్తుండటంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ప్రజల్ని తరలించేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉంది. 


ఈసారి ఏపీతో పాటు ఒడిశాలో భారీ నుంచి అతి బారీ వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడతో సహా దక్షిణ ఒడిశా జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. 22వ తేదీన ఏర్పడనున్న అల్పపీడనం 24 నాటికి వాయుగుండంగా మారనుంది. అయితే తుపానుగా మారుతుందా లేదా అనేది మరో 2-3 రోజుల్లో అంచనా వేయగలమని వాతావరణ శాఖ తెలిపింది. 


Also read: YS Sharmila: రూ.99కే క్వార్టర్‌ సీసా ఇస్తే అత్యాచారాలు జరుగుతాయి? మద్యంపై వైఎస్‌ షర్మిల ఆందోళన



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.