Schools Holiday: ఏపీలో అతి భారీ వర్షాల హెచ్చరిక, ఈ జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు
Schools Holiday: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఏపీలో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఫలితంగా ఇవాళ కూడా కొన్ని జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Schools Holiday: బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడటంతో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 2-3 రోజులు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని తెలుస్తోంది. ఫలితంగా ఏపీలోని కొన్ని జిల్లాల్లో విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. రాష్ట్రంలో రానున్న 2-3 రోజుల్లో భారీ వర్షాలు పడున్నాయి. కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడవచ్చని ఐఎండీ ఇప్పటికే హెచ్చరించిది. దాంతో కొన్ని జిల్లాల్లో విద్యా సంస్థలకు ఇవాళ సెలవు ప్రకటించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో విద్యార్ధుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఆయా జిల్లాల కలెక్టర్లను ఈ నిర్ణయం తీసుకున్నారు.
ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, బాపట్ల జిల్లాల్లోని విద్యాసంస్థలకు ఇవాళ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. బంగాఖాతంలో అల్పపీజనం, ద్రోణి కారణంగా రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చాలా ప్రాంతాల్లో రాకపోకలకు ఇబ్బంది కలిగింది.
అటు గోదావరి నదిలో కూడా వరద ప్రవాహం పెరుగుతోంది. ధవళేశ్వరం వద్ద ఉన్న మొదటి ప్రమాద హెచ్చరిక జారీ ఉపసంహరించినా ఇంకా కోనసీమ లంక గ్రామాలు మాత్రం బితుకుబితుకుమంటున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.