Heat Waves: ఏపీలోనే కాదు దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కంటే 2-3 డిగ్రీలు అదనంగా ఉష్ణోగ్రత నమోదవుతున్న పరిస్థితి. ఏపీలో గత 4-5 రోజుల్నించి పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. రానున్న 3-4 రోజులు ఎండలు మరింత పెరగవచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. వడగాల్పులు వీచే ప్రమాదమున్నందున అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ సైతం హెచ్చరించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశవ్యాప్తంగా ఈ వేసవి అత్యంత తీవ్రంగా ఉండవచ్చనే సంకేతాలు వస్తున్నాయి. ఎల్‌నినో పరిస్థితులు, ఆసియా ఖండంలోని కొన్ని దేశాల్లో తీవ్ర వర్షాభావం వంటివి ఎండల తీవ్రత పెరగడానికి కారణాలు కావచ్చు. ఈ వేసవిలో సాదారణం కంటే 3-4 డిగ్రీలు అధికంగా నమోదు కావచ్చు. ముఖ్యంగా ఎండల తీవ్రత రానున్న రోజుల్లో మరింత పెరగనుంది. రెండ్రోజుల్నించి ఉత్తర కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వడగాల్పులు వీచాయి. పకగటి ఉష్ణోగ్రత సాదారణం కంటే 2-3 డిగ్రీలు అధికంగా కన్పించింది. రానున్న 3-4 రోజుల్లో వడగాలుల తీవ్రత మరింత పెరగవచ్చు. ఇక రాయలసీమ జిల్లాల్లో అయితే వాతావరణంలో తేమ కన్పించదు. చాలా హ్యుమిడిటీ ఉంటుంది. 


రానున్న రోజుల్లో ఎండలు పెరగడమే కాకుండా వడగాలులు వీస్తాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇవాళ రాష్ట్రంలోని 42 మండలాల్లో వడగాల్పు, ఎల్లుండి 44 మండలాల్లో వడగాల్పులు వీయవచ్చు. ముఖ్యంగా కడప, నంద్యాల, పార్వతీపురం మన్యం, ఎన్టీఆర్, గుంటూరు , పల్నాడు జిల్లాల్లో పరిస్థితి కఠినంగా ఉండనుంది. ఇప్పటికే రాయలసీమలో అత్యధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నంద్యాలలో 42 డిగ్రీలు, కర్నూలులో 41,.9, అనంతపురంలో 40.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కడప, నంద్యాల, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో వడగాలులు వీచే ప్రమాదముందని, పగటి పూట చిన్న పిల్లలు, వృద్ధులు బయటకు రావద్దని సూచిస్తున్నారు. 


Also read: AP DSC 2024 Postponed: ఏపీ టెట్ ఫలితాలు, డీఎస్సీ పరీక్షలు వాయిదా, తిరిగి ఎప్పుడంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook