AP DSC 2024 Postponed: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన డీఎస్సీ 2024 పరీక్షలు, టెట్ పరీక్ష ఫలితాలు ప్రక్రియ నిలిచిపోయింది. డీఎస్సీ పరీక్షా కేంద్రాల ఆప్షన్ల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్దులకు క్లారిటీ వచ్చింది. డీఎస్సీ 2024 పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది ఏపీ విద్యాశాఖ. ఎన్నికల సంఘం నుంచి అనుమతి వచ్చిన తరువాతే కొత్త షెడ్యూల్ ప్రకటిస్తామని తెలిపింది.
ఏపీ డీఎస్సీ పరీక్షలు, టెట్ పరీక్ష ఫలితాలకు ఎన్నికలు అడ్డుపడ్డాయి. ఓ వైపు టెట్ పరీక్ష 2024 ఫలితాలు వెల్లడి కావల్సి ఉన్నాయి. మరోవైపు మార్చ్ 30 నుంచి ఏప్రిల్ 30 వరకూ డీఎస్సీ 2024 పరీక్షలు జరగాల్సి ఉన్నాయి. మార్చ్ 20 నుంచి పరీక్షా కేంద్రాల వెబ్ ఆప్షన్లు, 25 నుంచి హాల్ టికెట్ల డౌన్‌లోడ్ జరగాల్సి ఉంది. కానీ ఎన్నికల కమీషన్ అనుమతి కోసం ప్రభుత్వం లేఖ రాయడం, అనుమతి రావడంలో ఆలస్యం జరగడంతో ఇక పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు విద్యా శాఖ తెలిపింది. ఎన్నికల కమీషన్ అనుమతి లభించిన తరువాతే కొత్త షెడ్యూల్ ప్రకటిస్తామని వెల్లడించింది. పరీక్ష కేంద్రాల ఎంపిక కూడా కొత్త షెడ్యూల్ ప్రకారమే జరగనుంది.
ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. ఎన్నికల తరువాత డీఎస్సీ పరీక్షలు నిర్వహించాలంటూ వేయికి పైగా ఫిర్యాదులు వచ్చాయని అన్నింటినీ కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించామన ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. ఎన్నికల కమీషన్ నుంచి క్లారిటీ రాకపోవడంతో పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది ఏపీ విద్యాశాఖ. ఎన్నికల తరువాత ఒకేసారి టెట్ పరీక్ష ఫలితాలు విడుదల చేసి డీఎస్సీ పరీక్షలు నిర్వహించే అవకాశాలు కన్పిస్తున్నాయి.
Also read: Nikhil Siddhartha TDP: హీరో నిఖిల్ సిద్ధార్థ్ సంచలనం.. అనూహ్యంగా టీడీపీలో చేరిక
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook