AP govt to conduct 10th class exams in May 2021 | అమరావతి: కరోనావైరస్ మహమ్మారి కారణంగా ఈ ఏడాదిలో జరిగిన 10వ తరగతి బోర్డు పరీక్షల షెడ్యూల్‌ తీవ్ర అయోమయానికి గురిచేసిన నేపథ్యంలో రానున్న పదో తరగతి పరీక్షలు నిర్వహణపై ఏపీ సర్కార్ స్పష్టమైన వైఖరితో ముందుకు వెళ్తోంది. అందులో భాగంగానే 2021లో ఏప్రిల్‌ 30 వరకు తరగతులు నిర్వహించి ఆ తర్వాత మే నెలలో టెన్త్‌ క్లాస్ బోర్డ్‌ ఎగ్జామ్స్‌ నిర్వహించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఏపీలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యా యులు, స్కూల్‌ అసిస్టెంట్స్, విద్యాశాఖ అధికారులతో కలిసి రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి డైరెక్టర్‌ బి.ప్రతాప్‌ రెడ్డి నిన్న ఆన్‌లైన్‌ మీటింగ్ నిర్వహించిన సందర్భంగా ఆయన ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

10వ తరగతి పరీక్షల్లో ( AP 10th class exams ) ఎన్ని పేపర్లు ఉండాలనే విషయంలో విద్యా శాఖ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని చెప్పిన ప్రతాప్ రెడ్డి.. జనవరిలో ఫార్మేటివ్‌ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. 9వ తరగతి, 10వ తరగతి విద్యార్థులకు జనవరి 6, 7, 8 తేదీల్లో ఫార్మేటివ్-1 పరీక్షలు జరుగుతాయని.. అలాగే 7వ తరగతి, 8వ తరగతి విద్యార్థులకు జనవరి 21, 22, 23 తేదీల్లో ఫార్మేటివ్‌ పరీక్షలు ఉంటాయని అన్నారు. 


Also read : YSR Rythu Bharosa Scheme: మనీ ఖాతాల్లోకి రాలేదా.. అయితే ఇలా చేయండి


ఇప్పటికే సిలబస్‌ను ( AP 10th class syllabus ) కుదించడం జరిగిందని గుర్తుచేసిన ప్రతాప్ రెడ్డి.. ప్రస్తుత సిలబస్‌ను పూర్తి చేసేందుకు ఏప్రిల్‌ నెల వరకు సమయం ఉన్నందున విద్యార్థులకు అన్ని పాఠ్యాంశాలను పూర్తిగా బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు.


Also read : New coronavirus strain: ఏపీలో రాజమండ్రి మహిళకు కొత్త కరోనా వైరస్ నిర్ధారణ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook