AP and Telangana Inter Exams: ఏపీ, తెలంగాణల్లో ఇంటర్ పరీక్షలు ఎప్పుడు, జేఈఈ పరీక్షల కారణంగా ప్రభుత్వాల ఇబ్బందులు
AP and Telangana Inter Exams: ఏపీ, తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ వ్యవహారం గందరగోళంగా మారుతోంది. జేఈఈ మెయిన్స్ పరీక్షలు రెండు రాష్ట్రాల్లో సమస్యగా మారాయి. ఆ పరీక్షల షెడ్యూలింగ్..ఇంటర్ పరీక్షలపై పడుతోంది.
AP and Telangana Inter Exams: ఏపీ, తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ వ్యవహారం గందరగోళంగా మారుతోంది. జేఈఈ మెయిన్స్ పరీక్షలు రెండు రాష్ట్రాల్లో సమస్యగా మారాయి. ఆ పరీక్షల షెడ్యూలింగ్..ఇంటర్ పరీక్షలపై పడుతోంది.
జేఈఈ మెయిన్స్ పరీక్షల్ని నిర్వహిస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వైఖరి రెండు తెలుగు రాష్ట్రాల్లో సమస్యల్ని తెచ్చిపెడుతోంది. రాష్ట్రాలతో సంబంధం లేకుండా హఠాత్తుగా షెడ్యూల్ ప్రకటించడం, తిరిగి ఏదో కారణంతో రీషెడ్యూల్ చేయడంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ఇంటర్నీడియట్, పదవ తరగతి పరీక్షల నిర్వహణ ఆలస్యమవుతోంది. వాయిదాలపై వాయిదాలు పడుతూ విద్యార్ధులకు గందరగోళం కల్గిస్తోంది.
ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు తొలుత అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 7 నుంచి..మే 2 నుంచి పదవ తరగతి పరీక్షలు జరగాలి. అయితే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ..జేఈఈ మెయిన్స్ పరీక్షల్ని ఏప్రిల్ 15 నుంచి ప్రకటించడంతో రెండు పరీక్షల తేదీలు ఒక్కటే అయిపోయాయి. ఫలితంగా ఏపీ ప్రభుత్వం ఇంటర్మీడియట్ పరీక్షల్ని ఏప్రిల్ 22 కు వాయిదా వేసింది. అటు పదవ తరగతి పరీక్షల్ని మే 9వ తేదీకు వాయిదా వేసింది. ఈలోగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ..జేఈఈ మెయిన్స్ పరీక్షల్ని రీ షెడ్యూల్ చేసింది. మొదటి విడత పరీక్షల్ని ఏప్రిల్ 21, 24, 25, 29, మే 1, 4 తేదీల్లోనూ..రెండవ విడత పరీక్షల్ని మే 24 నుంచి 29 వరకూ నిర్వహించేందుకు నిర్ణయించింది. దాంతో మరోసారి ఇంటర్మీడియట్ పరీక్షల తేదీలపై ప్రభావం పడింది. ఇప్పుడు తిరిగి ఇంటర్మీడియట్ పరీక్షల్ని వాయిదా వేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. మే 5 నుంచి 23 తేదీల్లోగా నిర్వహించాల్సి వస్తుంది. లేదా జూన్ నెలకు వాయిదా వేయాలి. ఒకవేళ ఇంటర్మీడియట్ పరీక్షల్ని ..జేఈఈ పరీక్షలకు అనుగుణంగా వాయిదా వేస్తే..మే 9 నుంచి నిర్వహించాలని భావిస్తున్న పదవ తరగతి పరీక్షల్ని ఎప్పుడు నిర్వహించాలనే ప్రశ్న వస్తోంది. ఎందుకంటే భద్రతా కారణాల దృష్ట్యా రెండు పబ్లిక్ పరీక్షల్ని ఒకే సమయంలో నిర్వహించడం కష్టతరమవుతుంది.
ఇక తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఏప్రిల్ 22 నుంచి నిర్వహించాలని భావించగా..జేఈఈ మెయిన్స్ కారణంగా వాయిదా పడ్డాయి. మే 11 నుంచి నిర్వహించాలని తెలంగాణ బోర్డు భావిస్తోంది. అయితే జేఈఈ మెయిన్స్ పరీక్షల రెండవ విడత మే 24 నుంచి ఉండటంతో ఇక్కడ కూడా వాయిదా వేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ రెండు రాష్ట్రాల్లోనూ జేఈఈ మెయిన్స్ పరీక్షల రెండు విడతల మద్య విరామంలో నిర్వహిస్తే...తల్లిదండ్రుల్నించి వ్యతిరేకత ఎదురవుతోంది. ఎందుకంటే మే నెల మండు వేసవి కావడంతో..అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి జేఈఈ పరీక్షల ప్రభావం ఇంటర్ పరీక్షలపై పడుతుంటే..ఇంటర్ పరీక్షల నిర్వహణ కాస్తా పదవ తరగతి పరీక్షలపై పడుతోంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వైఖరి కారణంగా రెండు రాష్ట్రాల్లో విద్యాశాఖలు, విద్యార్ధులు ఇబ్బందుల్లో పడుతున్నారు. పరీక్షలు ఎప్పుడుంటాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడు వాయిదా పడతాయో తెలియడం లేదు. ఇప్పుడున్న జేఈఈ పరీక్షలకు అనుగుణంగా ఇంటర్ పరీక్షల తేదీ ప్రకటిస్తే..నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ..జేఈఈ పరీక్షల్ని మరోసారి వాయిదా వేస్తే పరిస్థితి ఏంటనే ప్రశ్నలు కూడా విన్పిస్తున్నాయి.
Also read: Summer Effect: ఏపీ, తెలంగాణల్లో మండుతున్న ఎండలు, మార్చ్ 21 న తుపాను..విచిత్ర పరిస్థితి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook