Summer Effect: ఏపీ, తెలంగాణల్లో మండుతున్న ఎండలు, మార్చ్ 21 న తుపాను..విచిత్ర పరిస్థితి

Summer Effect: వేసవి అప్పుడే ఠారెత్తిస్తోంది. ఎండలు భగభగమంటున్నాయి. ఉక్కపోత పెరుగుతోంది. ఈ వేసవి తీవ్రంగా  ఉండనుందనే వాతావరణ శాఖ హెచ్చరికలు ప్రత్యక్షంగా కన్పిస్తున్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో తుపాను హెచ్చరిక కూడా జారీ అయింది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 17, 2022, 09:19 AM IST
  • తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోతున్న ఎండలు
  • మే నాటికి 46-47 డిగ్రీలకు చేరుకోవచ్చని అంచనా
  • బంగాళాఖాతంలో మార్చ్ 21 నాటికి తుపాను హెచ్చరిక
Summer Effect: ఏపీ, తెలంగాణల్లో మండుతున్న ఎండలు, మార్చ్ 21 న తుపాను..విచిత్ర పరిస్థితి

Summer Effect: వేసవి అప్పుడే ఠారెత్తిస్తోంది. ఎండలు భగభగమంటున్నాయి. ఉక్కపోత పెరుగుతోంది. ఈ వేసవి తీవ్రంగా  ఉండనుందనే వాతావరణ శాఖ హెచ్చరికలు ప్రత్యక్షంగా కన్పిస్తున్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో తుపాను హెచ్చరిక కూడా జారీ అయింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వేసవి ప్రతాపం చూపిస్తోంది. మార్చ్ నెలలోనే పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. గత కొన్నిరోజులుగా ఎండల తీవ్రత పెరిగిపోతోంది. ఈ వేసవి తెలుగు రాష్ట్రాల్లో తీవ్రంగా ఉండనుందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ వేసవిలో పగటి ఉష్ణోగ్రతలు మే నాటికి 46-47 డిగ్రీల వరకూ చేరవచ్చని వెల్లడించింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే స్వల్పంగా వడగాల్పులు కూడా ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ఇవాళ, రేపు తెలుగు రాష్ట్రాల్లో వడగాల్పుుల వీచే అవకాశాలున్నాయని ఐఎండీ తెలిపింది. 

ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి, విజయవాడ, ఏలూరు, అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రత 39-40 డిగ్రీలు నమోదవుతోంది. ఇది క్రమంగా పెరగవచ్చని తెలుస్తోంది. మే నాటికి గరిష్టంగా 47 డిగ్రీల వరకూ చేరే పరిస్థితి ఉందని సమాచారం. ఇక వడగాల్పుల తీవ్రత విజయవాడ, రాజమండ్రి, రాయలసీమ ప్రాంతాల్లో అత్యధికంగా ఉండవచ్చని ఐఎండీ నివేదించింది. అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పుల విషయంలో ఇప్పటికే వాతావరణ శాఖ ఆరెంజ్ ఎలర్ట్ జారీ చేసింది. పగటి ఉష్ణోగ్రతలు తెలుగు రాష్ట్రాల్లో 6-7 డిగ్రీలు అధికంగా ఉండవచ్చని తెలిపింది. 

ఇక తెలంగాణ ప్రాంతంలో పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. నల్గొండలో అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కంటే 5 డిగ్రీలు ఎక్కువ. గత పదేళ్లకాలంలో ఇదే అత్యధికం. ఇక అదిలాబాద్, రామగుండం, నిజామాబాద్, పెద్దపల్లి, భద్రాచలం, మెదక్ ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరుకుంది. క్రమంలో ఏప్రిల్, మే నాటికి పగటి ఉష్ణోగ్రత మరింత పెరగవచ్చు. ఉత్తర, ఈశాన్య ప్రాంతాల్నించి తెలంగాణ, ఏపీలోకి వీస్తున్న గాలుల ప్రభావంతో..వడగాల్పులు ఎక్కువగా ఉంటాయి. వడగాల్పుల కారణంగా గాలిలో తేమ లేక..ఉక్కపోత అధికం కానుంది. 

మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని..మార్చ్ 21 నాటికి తుపానుగా మారనుందని ఐఎండీ హెచ్చరించింది. మార్చ్ 19 నాటికి తీవ్ర అల్పపీడనంగా మారి..20వ తేదీ నాటికి వాయుగుండంగా మారుతుంది. ఆ తరువాత 21వ తేదీకు తుపానుగా మారి.. ఉత్తర ఈశాన్య దిశగా పయనిస్తూ..మార్చ 23 నాటికి బంగ్లాదేశ్, ఉత్తర మయన్మార్ తీరానికి చేరనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. తుపాను కారణంగా ఏపీలో వర్షాలు పడవచ్చని తెలుస్తోంది. 

Also read: APSRTC Concession: 60 ఏళ్ల వయసు దాటిన వారికి ఆర్టీసీలో 25 శాతం రాయితీ!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News