Heavy Rains Alert: నైరుతి బంగాళాఖాతంలో ప్రస్తుతం ఉపరితల ద్రోణి విస్తరించి ఉంది. రేపటికి ఇది అల్పపీడనంగా మారి ఆ తరువాత వాయుగుండంగా బలపడే అవకాశాలున్నాయి. ఫలితంగా రానున్న 4 రోజుల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా దక్షిణ కోస్తాపై తీవ్ర ప్రభావం పడనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారనుంది. ఆ తరువాత పశ్చిమ దిశగా కదులుతూ తమిళనాడు , శ్రీలంక తీరానికి సమీపించేసరికి వాయుగుండంగా బలపడనుందని ఐఎండీ వెల్లడించింది. ప్రస్తుతం తూర్పు మధ్య బంగాళాఖాతం వరకూ ద్రోణి విస్తరించి ఉంది. అల్పపీడనం కారణంగా నవంబర్ 12, 13, 14, 15 తేదీల్లో రాయలసీమతో పాటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. వరి కోతలు, ఇతర పంటల విషయంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. అల్పపీడనం కారణంగా రానున్న 4 రోజులు ఏపీ, తమిళనాడు, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు సైతం పడవచ్చు. తమిళనాడు, కేరళలో ఇప్పటికే భారీ వర్షాలు పడుతున్నాయి. 


మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని సూచనలు జారీ అయ్యాయి. ఏపీలో ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్రలోని నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, కృష్ణా, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఎల్లుండి నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ఉత్తరాంధ్రపై స్వల్ప ప్రభావం కన్పించనుంది. 


ఇక తెలంగాణలో సైతం నవంబర్ 12 నుంచి 15 వరకూ మోస్తరు వర్షాలు పడనున్నాయి. కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో వర్షాలు పడవచ్చు. పిడుుగులు కూడా పడే ప్రమాదమున్నందున ఆరు బయట, చెట్లు, టవర్ల కింద ఉండవద్దని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. 


Also read: BSNL Long Term Plans: కేవలం బీఎస్ఎన్ఎల్ మాత్రమే అందిస్తున్న ఏకైక ప్లాన్, 395 రోజుల వ్యాలిడిటీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.