Meena: టాలీవుడ్ హీరోలతో ప్రేమలో పడకపోవడానికి కారణం ఉంది..! నటి మీనా ఆసక్తికర వ్యాఖ్యలు..

Actress Meena Comments On Tollywood: తెలుగు, తమిళ, కన్నడ సినిమాలో మంచి పేరు పొందిన యాక్టర్ మీనా గురించిన ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఈమెకు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. మీన యాక్టర్ మాత్రమే కాదు.. భరతనాట్యం డాన్సర్ కూడా. హిందీ సినిమాలో కూడా తన మార్కును చూపించిన మీనా ఇటీవల తెలుగు సినిమా హీరోలతో ప్రేమలో పడక పోవడానికి కారణం ఉంది అంటూ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
 

1 /6

సినిమాలోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆరంగేట్రం చేశారు మీన. ముందుగా తమిళ సినిమాలో నటించారు. ఆ తర్వాత తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ సినిమాల్లో నటించారు. ఈమెకి ఇప్పటికీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ బాగానే ఉంది.  

2 /6

ముఖ్యంగా బడా హీరోలతో అన్ని భాషల్లో నటించేసిన మీనకు ఎన్నో అవార్డులు కూడా ఉన్నాయి. ఫిలీం ఫెయిర్ అవార్డు, నంది అవార్డ్స్, సినిమా ఎక్స్ప్రెస్ అవార్డ్స్, కళైమామణి వంటి అవార్డులు పొందింది.  

3 /6

శివాజీ గణేషన్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ రంగ ప్రవేశం చేసింది మీనా. ఆ తర్వాత రజనీకాంత్ సినిమాలో నటించింది. ఇక తెలుగు సినిమాల్లో రాజేంద్రప్రసాద్ తో కలిపి 'నవయుగం' అనే సినిమాలో 1990లో నటించింది.  

4 /6

ఇక తెలుగు సినిమా 'చంటి' వెంకటేష్ తో కలిసి చేసిన సినిమా ఈ బెస్ట్ ఫిలింఫేర్ యాక్టర్ అవార్డు కూడా అందుకుంది.. ఈ సినిమాతో మీనా క్రేజ్ మరింత పెరిగింది. ప్రముఖ హీరోలు అందరితో సినిమా చేసేసింది.  

5 /6

అయితే మీనా విద్యాసాగర్‌ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. 2022 లో ఆయన అనారోగ్యంతో మరణించారు. ఇటీవల మీనా తెలుగు హీరోలతో ప్రేమలో పడకపోవడానికి కారణం ఉంది అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీనా ఎక్కువగా వెంకటేష్, నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణతో కలిసి నటించారు. వాళ్లు చాలా ప్రొఫెషనల్‌గా ఉండేవారు అన్నారు.  

6 /6

అయితే తాను సినీ రంగ ప్రవేశం 15 ఏళ్ల లోపే చేశానని.. అది కాకుండా తాను నటించిన వారంతా తన కంటే పెద్ద వయసు వారు, అప్పటికే పెళ్లయిన వారు.. ఆ సమయంలో తనకు అంత మెచ్యూరిటీ లెవెల్స్ కూడా లేవు. దీంతో ప్రేమించే అవకాశం దక్కలేదు అని కామెంట్స్‌ చేశారు.