Ap Assembly live updates: ఏపీ శీతాకాల సమావేశాలు మూడవ రోజు రసవత్తరంగా సాగుతున్నాయి. కీలకమైన పలు బిల్లుల్ని ప్రవేశపెట్టారు. చర్చ జరపడం లేదనే కారణంతో టీడీపీ వాకౌట్ చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో( Assembly winter session ) మూడవరోజున తెలుగుదేశం సభ్యుల వాకౌట్ ( Tdp Walkout )తో సభ ప్రారంభమైంది. కీలకమైన పలు బిల్లుల్ని ప్రవేశపెట్టిన సందర్బంగా చర్చ జరపడం లేదని కారణం చెబుతూ టీడీపీ వాకౌట్ చేసింది. ఏపీ ఎలక్ట్రిసిటీ డ్యూటీ బిల్ ( Ap Electricity Duty bill ) ను మంత్రి బాలినేని..అసైన్డ్ ల్యాండ్స్ సవరణ చట్టాన్ని ఉప ముఖ్యమంత్రి థర్మాన కృష్ణదాస్ , ఏపీ వ్యాల్యూ యాడెడ్ ట్యాక్స్ థర్డ్ అమైండ్ మెంట్ ను మరో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిలు ప్రవేశపెట్టగా అసెంబ్లీ ఆమోదించింది.


మంత్రి అప్పలరాజు ప్రవేశపెట్టిన యానిమల్ ఫీడ్, క్వాలిటీ కంట్రోల్ బిల్లు, హోంమంత్రి సుచరిత ప్రవేశపెట్టిన దిశ బిల్లులపై ప్రస్తుతం చర్చ నడుస్తోంది. చర్చ అనంతరం ఆమోదం పొందనున్నాయి. మొత్తం ఇవాళ అసెంబ్లీలో 11 కీలకమైన బిల్లుల్ని ప్రవేశెపెడుతున్నారు.


ఇక చారిత్మాత్మకమైన వ్యవసాయ కౌన్సిల్ బిల్లును మంత్రి కన్నబాబు (  Minister kannababu ) ప్రవేశపెట్టారు. రైతులకు మేలు చేకూర్చేందుకే ఈ బిల్లును తెచ్చినట్టు మంత్రి తెెలిపారు.  దేశానికే వెన్నెముకగా నిలిచిన వ్యవసాయరంగానికి కౌన్సిల్ అవసరమన్నారు. ఈ కౌన్సిల్ ద్వారా రైతులకు విలువైన సూచనలు అందుతాయని..విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు దీని పరిధిలో ఉంటాయన్నారు. 


మరోవైపు ఏపీ ( Ap ) ఎలక్ట్రిసిటీ డ్యూటీ బిల్లుతో రాష్ట్రానికి మంచి జరుగుతుందన్నారు ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి. రైతులకు పగటిపూట నాణ్యమైన కరెంటు ఇవ్వాలంటే సౌర విద్యుత్ తప్పనిసరి అన్నారు. సౌర విద్యుత్ తో పర్యావరణానికి రైతులకు మేలు జరుగుతుందని చెప్పారు. ఎలక్ట్రిసిటీ డ్యూటీ బిల్లు సంబంధించి ఇంకా ఏమైనా సూచనలు, సలహాలు ఇవ్వాలని ప్రతిపక్షాన్ని కోరామన్నారు. పదివేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు మంచి నిర్ణయమని అన్నారు. Also read: Ap Assembly live: స్పీకర్‌ను బెదిరించిన చంద్రబాబు..సభలో దుమారం