Thammineni Seetharam: కబడ్డీ ఆడుతూ కాలు జారీ కింద పడ్డ ఏపీ స్పీకర్!
Thammineni Seetharam: ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కబడ్డీ ఆడుతూ కింద పడ్డారు. సొంత నియోజకవర్గం ఆముదాల వలసలో క్రీడా పోటీలు ప్రారంభించేందుకు వెళ్లిన ఆయనకు ఈ అనూహ్య పరిణామం ఎదురైంది.
Thammineni Seetharam: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాంకు అనుహ్య పరిణామం ఎదురైంది. తాజాగా కబడ్డీ ఆడుతూ ఆయన కింద పడ్డారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇంతకీ ఏం జరిగిందంటే..
ఆయన సొంత నియోజకవర్గమైన శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో సీఎం కప్ పేరుతో క్రీడా పోటీలు ప్రారంభించేందుకు ముఖ్య అతిథిగా వెళ్లారు తమ్మినేని సీతారాం. ఇందులో భాగంగా.. ఆటగాళ్లలో ఉత్సాహం నింపేందుకు కాసేపు కబడ్డీ ప్లేయర్ అవతారమెత్తారు తమ్మినేని సీతారాం.
ఇందులో భాగంగా.. స్థానిక నేతలతో కలిసి కొద్ది సేపు కబడ్డీ ఆడారు స్పీకర్. ఈ క్రమంలోనే కూతకు వెళ్లిన తమ్మినేని.. అవతలి వ్యక్తిని తాకబోయారు. ఆయితే ఆ వ్యక్తి తప్పించుకోవడంతో.. కాలు జారి అదుపు తప్పి కింద పడిపోయారు. అక్కడున్న కొంత మంది వెంటనే అప్రమత్తమై స్పీకర్‌ను పైకి లేపారు. తమ్మినేనికి పెద్దగా గాయాలు కాలేదని నిర్ధారించారు ఆయన సిబ్బంది.
తమ్మినేని సీతారాం గురించి..
శ్రీకాకులం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న నాయకుల్లో తమ్మినేని సీతారాం ఒకరు. 1983 నుంచి ఆయన ఆముదాల వలస రాజకీయాల్లో క్రియాశీలంగా ఉంటూ వస్తున్నారు.
టీడీపీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన తమ్మినేని సీతారాం చాలా కాలం వరకు అదే పార్టీలో ఉన్నారు. ఆ తర్వాత 2009లో ప్రజా రాజ్యం పార్టీలో చేరారు. ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన తర్వాత మళ్లీ 2013 వరకు టీడీపీలో ఉన్నారు. ఆ తర్వాత 2014లో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి ఆదే పార్టీలో కొనసాగుతున్నారు. ఆయన రాజకీయ అనుభవం దృష్టిలో ఉంచుకుని.. వైసీపీ ప్రభుత్వంలో తమ్మినేని సీతారాంకు స్పీకర్ పదవి లభించింది.
1983 నుంచి 2019 వరకు అముదాల వలస నుంచి 9 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన సీతారాం.. 5 సార్లు విజయం సాధించగా 4 సార్లు ఓటమిపాలయ్యారు.
Also read: AP Movie Ticket Issue: ఏపీలో సినిమా టికెట్ ధరల తగ్గింపుపై హీరో నాని సంచలన వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook