అంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. కీలకమైన బిల్లుల కోసం శీతాకాల సమావేశాల నోటిఫికేషన్ విడుదలైంది. ఐదురోజులపాటు సాగే అవకాశాలున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కరోనా సంక్రమణ ( Corona virus ) ప్రారంభమైన తరువాత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ( Ap Assembly )రెండోసారి సమావేశం కాబోతుంది. శీతాకాల సమావేశాల నోటిఫికేషన్ వెలువడింది. రాష్ట్ర కేబినెట్ ( Ap Cabinet ) సమావేశం అనంతరం ఎన్నిరోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయనేది తేలనుంది. నవంబర్ 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 4 వరకూ జరిగే అవకాశాలున్నాయి.  


గ్యాంబ్లింగ్, ఎర్రచందనం స్మగ్లింగ్, డ్రగ్స్ అక్రమ రవాణా, ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో పరిధిని విస్తరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిన్నటి వరకు కేవలం అక్రమ ఇసుక, మద్యం అమ్మకాలకు మాత్రమే  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో పరిమితం కాగా..ఇప్పుడు దాని పరిధి.. గ్యాంబ్లింగ్, ఆన్ లైన్ బెట్టింగ్, డ్రగ్స్, ఎర్రచందనం, ఇతర నిషేధిత పదార్ధాలరు విస్తరించనుంది. కీలకమైన బిల్లులపై నిర్ణయం తీసుకునేందుకు అసెంబ్లీ సమావేశాల్ని ( Ap Assembly winter session ) ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం. Also read: AP: నవంబర్ 30 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు