Pawan Kalyan: పాలనలో పవన్ మార్క్.. స్పాట్‌లో సొల్యూషన్.. డిప్యూటీ సీఎంకు నెటిజన్లు సెల్యూట్

Deputy CM Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన మార్క్ పరిపాలన మొదలుపెట్టారు. ఎన్నికలకు ముందు అమ్మాయిల మిస్సింగ్‌పై ప్రభుత్వాన్ని నిలదీసిన పవన్.. అధికారంలోకి వచ్చిన ఈ తరువాత విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఓ మిస్సింగ్ కేసుపై స్వయంగా రంగంలోకి దిగారు.
 

  • Jun 22, 2024, 19:57 PM IST
1 /5

మంగళగిరి జనసేన కార్యాలయం దగ్గర రోడ్డుపైనే ఉపముఖ్యమంత్రి పవన్  కళ్యాణ్ ప్రజాదర్బార్ నిర్వహించారు. అసెంబ్లీ నుంచి తిరిగి మంగళగిరి పార్టీ ఆఫీసుకు వచ్చిన పవన్‌ కలిసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు.   

2 /5

దీంతో కాన్వాయిను నిలిపివేసి.. ఆఫీస్ ముందు కుర్చీలు వేసుకుని ప్రజలతో మాట్లాడారు. వాళ్ల వినతులు స్వీకరించి.. సమస్యలపై అప్పటికప్పుడు సంబంధిత అధికారులతో మాట్లాడారు.   

3 /5

ఈ సందర్భంగా భీమవరానికి చెందిన  శివకుమారి అనే మహిళ విజయవాడలో చదువుకుంటున్న తన కుమార్తె మైనర్ అని.. ఆమెను ప్రేమ పేరిట ట్రాప్ చేసి కిడ్నాప్ చేశారని పవన్‌కు చెప్పారు. గత 9 నెలలుగా ఆమె ఎక్కడ ఉందో తెలియదని కన్నీటిపర్యాంతం అయ్యారు.   

4 /5

మాచవరం పోలీస్ స్టేషన్లో దీనిపై ఫిర్యాదు చేశామని.. తమ కూతురు జాడ తెలిసినా పోలీసులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎఫ్‌ఐఆర్‌ కాపీని పరిశీలించిన పవన్ కళ్యాణ్.. వెంటనే మాచవరం సీఐకు కాల్ చేసి వివరాలు తెలుసుకున్నారు.   

5 /5

వెంటనే చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. బాధితులు, పార్టీ నాయకులను ఆఫీస్ వాహనంలోనే మాచవరం పీఎస్‌కు పంపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. సెల్యూట్ డిప్యూటీ సీఎం సార్ అంటూ నెటిజన్లు, పవన్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.