Jabardasth Actor: రైలు ప్రమాదంలో జబర్దస్త్‌ ఆర్టిస్ట్ దుర్మరణం.. విషాదంలో బుల్లితెర

Jabardasth Actor Mahamuddin Died: బుల్లితెరలో విషాదం చోటుచేసుకుంది. రైలు ప్రమాదంలో ఓ హాస్య నటుడు మరణించాడు. అతడి మరణంతో ప్రముఖ జబర్దస్త్‌ షోలో విషాదం అలుముకుంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jun 22, 2024, 01:38 PM IST
Jabardasth Actor: రైలు ప్రమాదంలో జబర్దస్త్‌ ఆర్టిస్ట్ దుర్మరణం.. విషాదంలో బుల్లితెర

Jabardasth Actor Mahamuddin: స్వస్థలం వెళ్లేందుకు వెళ్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు రైలు ప్రమాదంలో జబర్దస్త్‌ నటుడు మహ్మద్దీన్‌ దుర్మరణం పాలయ్యాడు. బయల్దేరిన రైలును ఎక్కేందుకు ప్రయత్నించి ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. రైలుకు, ప్లాట్‌ ఫాం మధ్య ఇరుక్కున తీవ్ర గాయాలతో చిక్కుకుని మరణించాడు. ఈ సంఘటన బుల్లితెరలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అతడి మృతితో జబర్దస్త్‌ నటీనటులు విషాదంలో మునిగారు.

Also Read: Vijay Antony: విజయ్ ఆంటోనీ ‘తుఫాన్’ మూవీపై పెరుగుతున్న అంచనాలు.. తాజాగా సెకండ్ సింగిల్ కు సూపర్ రెస్పాన్స్..

భద్రాద్రి కొత్త గూడెం జిల్లా చుంచుపల్లి మండలం నందాతండాకు చెందిన  మహ్మద్దీన్‌ (53) జబర్దస్త్‌ షోలో నటుడిగా ఉన్నారు. ఆ షోలో తన నటనతో నవ్విస్తున్నాడు. కొత్తగూడెం రైల్వే ఎస్సై సురేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం భద్రాచలం రోడ్డు‌ రైల్వే స్టేషన్‌కు మహ్మద్దీన్‌ శుక్రవారం చేరుకున్నాడు. అనంతరం కొత్తగూడెం వెళ్లేందుకు కాకతీయ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఎక్కే ప్రయత్నం చేశాడు. కదులుతున్న రైలును ఎక్కేందుకు ప్రయత్నించి కిందపడిపోయాడు. కిందకు జారిపడటంతో రైలు, ప్లాట్‌ ఫాం మధ్య ఇరుక్కుపో యాడు.

Also Read: Kalki 2898 AD: కల్కి గురించి కీలక విషయంపై.. వీడని సస్పెన్స్.. ఆందోళనలో ప్రభాస్ ఫ్యాన్స్..

ఇది గ్రహించిన రైలు లోపలి ప్రయాణికులు వెంటనే ప్రయాణికులు చైన్‌ లాగడంతో లోకో పైలెట్‌ రైలును ఆపారు. రైల్వే పోలీసులు సిబ్బంది సహాయంతో మహ్మద్దీన్‌ను బయటకు లాగి అంబులెన్స్‌ కొత్తగూడెంలోని జిల్లా సర్వజన ఆస్పత్రికి తరలించారు. నడుము, పక్కటెముకలకు తీవ్ర గాయాలైన బాధితుడికి వైద్యులు అత్యవసర చికి త్స విభాగంలో సేవలందిం చారు. మెరుగైన వైద్యం కోసం కుటుంబసభ్యులు ఖమ్మం తరలిస్తుండగా మార్గమధ్యలో మహ్మద్దీన్‌ మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు మృతదేహన్ని అప్పగించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News