AP Award: ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అభివృద్ధి పధంలో వెళ్తోంది. కొత్త పరిశ్రమలు వస్తున్నాయి. పారిశ్రామిక ప్రగతికి గుర్తింపు లభిస్తోంది. తాజాగా ప్రతిష్ఠాత్మక టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ అవార్డు దక్కించుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో కొత్త కొత్త పరిశ్రమలు వస్తున్నాయి. పారిశ్రామిక ప్రగతి వైపుకు ఏపీ దూసుకెళ్తోంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో వరుసగా మూడవసారి మొదటి స్థానం దక్కింది. కర్నూలు జిల్లాలో కొత్తగా రామ్ కో సిమెంట్ ఫ్యాక్టరీ ప్రారంభమైంది. ఇప్పుడు కొత్తగా రాష్ట్ర ప్రభుత్వానికి మరో ప్రతిష్ఠాత్మక అవార్డు దక్కింది. సుప్రసిద్ధ టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ అవార్డును సాధించింది ఆంధ్రప్రదేశ్. పోర్టు ఆధారిత మౌలిక వసతుల కల్పన విభాగంలో దేశంలోనే ఏపీ అత్యుత్తమ రాష్ట్రంగా నిలిచింది. నీతి ఆయోగ్ సలహదారుడు సుదేందు జే సిన్హా నేతృత్వంలోని కమిటీ..ఈ అవార్డుకు ఏపీను ఎంపిక చేసింది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిర్మితమౌతున్న పోర్టులే ఇందుకు కారణంగా తెలుస్తోంది. 


పోర్టు ఆధారిత మౌలిక వసతుల అభివృద్ధిలో రాష్ట్రానికి టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ అవార్డు ఇచ్చింది. దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ అవార్డును దేశ రాజధాని ఢిల్లీలో మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అందుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసి అవార్డు గురించి వివరించారు మంత్రి అమర్‌నాథ్. మంత్రిని ముఖ్యమంత్రి అభినందించారు. 


Also read: AP Government: తిరుపతి గోడలపై బొమ్మలు చెరపలేదు, ఆ ప్రచారం అవాస్తవం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook