ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ   ఈ రోజు ఢిల్లీ పెద్దలను కలిశారు. ఏపీలో పార్టీ బలోపేతం చేసే అంశంపై  సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంలో ఏపీ అభివృద్ధికి సంబంధించిన విషయాలు అధిష్టానం పెద్దల దృష్టికి తీసుకెళ్లారు... కాగా అమిత్ షాతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాష్ట్రానికి రావాల్సిన అన్ని తీసుకుంటూనే ఏపీకి  కేంద్రం అన్యాయం చేస్తోందని చంద్రబాబు ప్రజల్లో విష బీజాలు నాటారు. దేశంలో ఏ రాష్టానికి చేయని విధంగా కేంద్రం ఏపీకి ఇస్తోంది.  ఇదే అంశంపై తమ జాతీయ అధ్యక్షులు అమిత్ షాతో చర్చించామని కన్నా వెల్లడించారు.


కేంద్ర ప్రభుత్వ గ్రాంట్స్ విషయంలో 30 జిల్లాలు ఉన్న కర్నాటకకు రూ. 76 వేల కోట్లు ఇచ్చిన కేంద్రం.. కేవలం 13 జిల్లాలు ఉన్న ఏపీకి  లక్షా 26 వేల కోట్లు ఇచ్చిందని కన్నా వెల్లడించారు.  ఏపీ సర్కార్ రాయలసీమలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని  అడగనప్పటికీ కేంద్రం చొరవతోనే దీని నిర్మాణ ప్రక్రియ నడుస్తోందన్నారు. ఇలా చెప్పుకంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయన్నారు.. చంద్రబాబు అబద్ధపు ప్రచారాన్ని తిప్పికొడతామని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా పేర్కొన్నారు.