Khel Ratna Awards: యువ సంచలనం గుకేశ్‌కు ఖేల్‌ రత్న అవార్డు.. మిగతా ముగ్గురు వీరే!

Manu Bhaker And D Gukesh Among Four Athletes To Get Khel Ratna Award: భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఖేల్‌ రత్న క్రీడా పురస్కారాలను ప్రకటించింది. మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌ రత్న 2024 అవార్డుల జాబితాను విడుదల చేసింది. మొత్తం నలుగురికి అవార్డులు ఇవ్వగా యువ సంచలనం ప్రపంచ చెస్‌ చాంపియన్‌ గుకేశ్‌తోపాటు హర్మన్‌ ప్రీత్‌ సింగ్‌, పారా అథ్లెట్‌ ప్రవీణ్ కుమార్‌, షూటర్‌ మను భాకర్‌కు అవార్డులు లభించాయి.

1 /6

భారత ప్రభుత్వం 2024 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక ఖేల్‌ రత్న క్రీడా పురస్కారాలను ప్రకటించింది.

2 /6

మొత్తం నలుగురు క్రీడాకారులకు ఖేల్ రత్న అవార్డులు ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

3 /6

యువ సంచలనం.. ప్రపంచ చెస్‌ చాంపియన్‌ డి గుకేశ్‌కు మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌ రత్న అవార్డును భారత ప్రభుత్వం ప్రకటించింది.

4 /6

హకీ దిగ్గజ ఆటగాడు, భారత హాకీ జట్టు కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ సింగ్‌ను ఖేల్‌ రత్న అవార్డుతో ప్రభుత్వం గౌరవించింది.

5 /6

ఒలింపిక్‌ కాంస్య పతక విజేత అయిన షూటర్‌ మను భాకర్‌కు కూడా ఖేల్‌ రత్న అవార్డును ప్రభుత్వం ప్రకటించింది.

6 /6

పారా ఒలింపిక్స్‌ పతకం కైవసం చేసుకున్న పారా అథ్లెట్‌ ప్రవీణ్‌ కుమార్‌ ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం ఖేల్‌ రత్న పురస్కారంతో సత్కరించింది.