అనుకున్నట్లుగా బీజేపీ మంత్రులు కామినేని శ్రీనివాస్‌, మాణిక్యాలరావు రాజీనామా చేశారు. ఈ రోజు ఉదయం అసెంబ్లీలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం చంద్రబాబును కలిసిన ఇరువురు రాజీనామా లేఖలను సమర్పించారు.  విభజన హామీల విషయంలో కేంద్ర వైఖరికి నిరసిస్తూ మోడీ కేబినెట్ నుంచి వైదొలగాలని కేంద్ర మంత్రులు సుజనా చౌదరీ, అశోక్ గజపతి రాజులకు చంద్రబాబు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇలా టీడీపీ -బీజేపీ సంబంధాలు తెగిన నేపథ్యంలో బీజేపీ మంత్రులు రాజీనామా చేయాల్సి వచ్చింది.