Miraculous Man Bus Shocking Video Viral: సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.. ముఖ్యంగా పాములు, జంతువుల వంటి వీడియోలు వైరల్ కావడం మనం చూస్తూనే ఉంటాము. అయితే కొన్ని ప్రమాదకర దృశ్యాలు చూస్తే కూడా వైరల్ అవుతాయి. అలాంటి వీడియో తమిళనాడులో జరిగింది. ఇక్కడ పక్కోట్ టౌన్ లో ఓ వ్యక్తి రెండు రన్నింగ్ బస్సుల మధ్య ఇరుక్కున్నాడు.. వీడియో చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు వాటిని షేర్ చేస్తున్నారు. కొన్ని సెకండ్లలో కళ్ల ముందు జరిగిన అద్భుతాన్ని చూసి ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పని అయింది. సాధారణంగా బస్సు యాక్సిడెంట్ జరిగితే ప్రాణాలు పోతాయి. లేకపోతే తీవ్ర గాయాల పాలై ఆసుపత్రి పాలైన అవుతారు. కానీ ఈ వ్యక్తికి అలా జరగలేదు. రెండు రన్నింగ్ బస్సుల మధ్య ఇరుక్కున్న కింద పడిపోయాడు. కానీ, మళ్లీ లేచి వెళ్లిపోయాడు. ఏ గాయాలు కాలేదు.
ఈ వీడియో చూసిన అందరూ ఏదో మ్యాజిక్ జరిగింది. అతని అదృష్టం వల్ల బతికి బయటపడ్డాడు. మ్యాజికల్ మనిషి, మ్యాజిక్ జరిగింది అంటూ పోస్ట్ చేస్తున్నారు. ఏమాత్రం పొరపాటు జరిగిన డేంజర్ అయినా అతని బొక్కలు విరిగిపోయి, చచ్చిపోయేవాడు లేదా తీవ్ర గాయాలు అయ్యాయి.
ఈ వీడియోలో వ్యక్తి మామూలుగా రోడ్డు దాటుతున్నడు ముందు నుంచి ఒక రన్నింగ్ బస్సు వెళుతుంది. మధ్యలోకి వెళ్లాక వెనకనుంచి ఒక బస్సు అనుకోకుండా వచ్చేసింది.. ఆ రెండు బస్సుల మధ్య వ్యక్తి ఇరుక్కున్నాడు.. అక్కడ కింద పడిపోయాడు. అతి దగ్గరగా రెండు బస్సులు రాసుకున్నాయా అన్నట్టు ఆ వీడియోలో కనిపించింది. కానీ, ఆ వ్యక్తికి మాత్రం ఏంకాలేదు, బస్సులు వెళ్లిపోయాక ఆ వ్యక్తి లేచి వెళ్లిపోయాడు. ఇదంతా ఎలా సాధ్యం అసలు కళ్ల ముందు ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పని జరిగిందని అందరూ ఆశ్చర్యపోతున్నారు.
రెండు బస్సుల మధ్య ఇరుక్కుపోయి ప్రాణాలతో బైట పడ్డ వ్యక్తి..
తమిళనాడు - పట్టుకొట్టాయ్స్‌లో ఓ వ్యక్తి రోడ్డు దాటే క్రమంలో రెండు బస్సుల మధ్య ఇరుక్కుపోయాడు.
అదృష్టవశాత్తు అతనికి ఒంటిపై ఎలాంటి గాయాలు కాకుండా బయటపడ్డాడు. pic.twitter.com/HbiitZsphF
— Telugu Scribe (@TeluguScribe) January 3, 2025
అతని అదృష్టం భూమి మీద నూకలు ఉన్నాయి కాబట్టి, అతను బతికి బట్ట కట్టాడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి డేంజర్ పరిస్థితుల్లో కూడా బతికి బట్టకట్టాడంటే సో గ్రేట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. సాధారణంగా రోడ్డు దాటేటప్పుడు కచ్చితంగా కొన్ని సేఫ్టీ రూల్స్ పాటించాలి, ట్రాఫిక్ రూల్స్ కూడా పాటించాలి. పెద్ద వాహనాలు వచ్చినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్నిసార్లు ఇలా బతికి బట్ట కడతారు కానీ సాధారణంగా బతకడం కష్టం. ఈ వీడియోను చూసినవారు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కామెంట్లు పెడుతున్నారు. రోడ్డు దాటేటప్పుడు ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయి. ప్రాణాలు పోయే పరిస్థితులు కూడా ఉంటాయి. అందుకే రోడ్ రూల్స్ తప్పనిసరి.
ఇదీ చదవండి: క్లీంకార క్యూట్ వీడియో.. ఫస్ట్ టైమ్ టీవీలో తండ్రిని చూసి అల్లరి చేసిన మెగా ప్రిన్సెస్..!
ఇదీ చదవండి: హెచ్‌ఎంపీవీ డేంజర్ బెల్స్.. తల్లిదండ్రులకు డబ్ల్యూఏఎఫ్ కీలక సూచనలు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.