Ap Bjp: హిందూత్వం అప్పుడెందుకు గుర్తుకు రాలేదు ?
ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నిప్పులు చెరిగారు. కృష్ణా పుష్కరాల్లో పలుదేవాలయాల్ని టీడీపీ నేలమట్టం చేసినప్పుడు హిందూత్వం గుర్తుకు రాలేదా అంటూ ఫైర్ అయ్యారు.
ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ( Chandra babu naidu ) పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నిప్పులు చెరిగారు. కృష్ణా పుష్కరాల్లో పలుదేవాలయాల్ని టీడీపీ నేలమట్టం చేసినప్పుడు హిందూత్వం గుర్తుకు రాలేదా అంటూ ఫైర్ అయ్యారు.
హిందూత్వంపై దాడులు జరుగుతున్నాయంటూ మాట్లాడే హక్కు టీడీపీకు లేదని బీజేపీ ఏపీ అధ్యక్షుడు ( Bjp ap president ) సోము వీర్రాజు ( Somu veerraju ) ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా పుష్కరాల్లో 17 దేవాలయాల్ని అప్పటి టీడీపీ ప్రభుత్వం నేలమట్టం చేసినప్పుడు గానీ..విజయవాడ గోశాల ప్రాంత సందర్శనలో బుద్దావెంకన్న దాడికి ప్రయత్నించినప్పుడు గానీ హిందూత్వం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్న ఐదేళ్లు ఒక్క ఆలయమైనా నిర్మించారా అని ప్రశ్నించారు. కృష్ణా పుష్కరాల్లో ( krishna purshkarams ) ఆలయాలు కూల్చేసినప్పుడు చినరాజప్ప ఎక్కడున్నారు..ఆ రోజు మాట్లాడని రాజప్ప ఇప్పుడు అంతర్వేది ఘటన ( Antarvedi incident ) పై ఎలా మాట్లాడతారని సోము వీర్రాజు విమర్శించారు.
దేశంలో రాజధాని నిర్మాణాలు ఎక్కడ జరిగినా అమరావతి అంతగా హైప్ లేదని..చైనా, జపాన్, సింగపూర్ అంటూ హైప్ క్రియేట్ చేశారే కానీ అమరావతి ఎందుకు నిర్మించలేదో చంద్రబాబును అందరూ ప్రశ్నించారని వీర్రాజు కోరారు. రాజధాని నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చిన 7 వేల 2 వందల కోట్లు ఏం చేశావని చంద్రబాబును నిలదీశారు. Also read: AP Unlock 4 Guidelines: ఏపీలో అన్‌లాక్ 4.0 మార్గదర్శకాలు విడుదల