అసెంబ్లీ శాసనసభ బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్దమైంది. ఎన్నికల ముందు చివరి బడ్జెట్ కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. పూర్తి స్థాయి బడ్జెట్ కావడంతో ఏయే అంశాలకు ప్రాధాన్యత ఉంటుంది, మూడు రాజధానుల అంశం, గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కీలకం కానున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు కొత్త గవర్నర్ అబ్దుల్ నజీర్ శాసనసభ, శాసనమండలి ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం రెండు సభలు వాయిదా పడనున్నాయి. గవర్నర్ ప్రసంగం అనంతరం అసెంబీ స్పీకర్ తమ్మినేని సీతారాం నేతృత్వంలో బీఏసీ సమావేశం జరగనుంది. ఇందులో సభ ఎన్నిరోజులు నిర్వహించాలి, ఏ అంశాల్ని చర్చించాలి, బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టాలనే అంశాల్ని నిర్ణయిస్తారు. ఇప్పటి వరకూ ఉన్న సమాచారం మేరకు ఈ నెల 14 నుంచి 24 వరకూ బడ్జెట్ సమావేశాలు జరగవచ్చు. అంటే అసెంబ్లీ సమావేశాలు 7-8 రోజులు రావచ్చు. ఈ నెల 17వ తేదీన రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 


బీఏసీ సమావేశం ముగిసిన తరువాత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన తీర్మానాలకు కేబినెట్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఇది పూర్తి స్థాయి చివరి బడ్జెట్ కావడంతో 2 లక్షల 60 వేల కోట్లు ఉండవచ్చని అంచనా. ఈసారి బడ్జెట్ లో సంక్షేమంతో పాటు వ్యవసాయం, విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఉండవచ్చు. మూడు రాజధానుల అంశం, గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ అంశాలకు బడ్జెట్‌లో ప్రాధాన్యత ఉండవచ్చు.


Also read: Tenth Class Hall Tickets: పదవ తరగతి పరీక్షల హాల్ టికెట్లు విడుదల, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook