ఆంధ్రప్రదేశ్‌లో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YSJagan Mohan Reddy) తన మార్క్ పాలన కొనసాగిస్తున్నారు. ఓ వైపు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుడుతూనే మరోవైపు ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరు సమీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు కొత్త సభ్యులను మంత్రి వర్గంలోకి (AP Cabinet Expansion) తీసుకున్నారు. శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, డాక్టర్ సీదిరి అప్పలరాజులు బుధవారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణలు రాజ్యసభకు ఎన్నికైన తరుణంలో తమ మంత్రి పదవులకు రాజీనామా చేయగా.. రెండు బెర్త్ లు ఖాళీ అయ్యాయి. హైకోర్టు అడిగిన వివరాలు ఇవ్వండి: CM KCR 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాజ్‌భవన్‌లోని దర్బార్ హాలులో శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, డాక్టర్ సీదిరి అప్పలరాజులతో నేటి మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణం చేయించనున్నారు. వేణుగోపాలకృష్ణకు రహదారులు, భవనాల శాఖ, అప్పలరాజుకు మత్స్య, పశుసంవర్ధకశాఖలను అప్పగించనున్నారని పార్టీ వర్గాల సమాచారం. పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామా చేసిన డిప్యూటీ సీఎం పదవిని శ్రీకాకుళం నేత, మంత్రి ధర్మాన కృష్ణదాస్‌కు అప్పగించనున్నారు. దాదాపుగా రెవెన్యూ శాఖ బాధ్యతలు ఆయనకే ఖరారు చేశారని తెలుస్తోంది. హాట్ మోడల్, ఫుట్‌బాల్ రిఫరీ ఫొటోలు వైరల్


శాసనమండలి చైర్మన్ షరీఫ్, అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, సీఎం వైఎస్ జగన్, డిప్యూటీ సీఎంలు, నూతన మంత్రుల కుటుంబసభ్యుల సమక్షంలో ఈ ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించనున్నారు. వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..