Lady Aghori hot comments on cm Revnath reddy: తెలంగాణలో ఎప్పుడైతే ముత్యాలమ్మ ఘటన చోటు చేసుకుందో అక్కడ అఘోరీ వచ్చింది. అంతే కాకుండా.. ముత్యాలమ్మ ఆలయం వద్దకు వెళ్లి ప్రత్యేకమైన పూజలు చేశారు. తెలంగాణలో వరుసగా ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో.. సనాతన ధర్మం కోసం ఎంతవరకైన వెళ్తానని అఘోరీ మాత చెప్పుకొచ్చారు. ఇటీవల ఏపీలో అఘోరీ మాత.. శ్రీకాళ హస్తీ, విజయవాడ ఇంద్ర కీలాద్రి వంటి అనేక ఆలయాలను దర్శించుకున్నారు. అదే విధంగా శ్రీకాళ హస్తీలో సూసైడ్ కు కూడా యత్నించారు.
మరోవైపు సనాతన ధర్మంకోసం ఇటీవల ఏపీలో పొరాడుతున్ను పవన్ కళ్యాణ్ ను లేడీ అఘోరీ మాత వెళ్లి కలుస్తుందని కూడా వార్తలు వచ్చాయి. అయితే.. లేడీ అఘోరీ మళ్లీ తెలంగాణలో శంషాబాద్ కు చేరుకున్నారు. అక్కడ నవగ్రహా దేవాలయం, పొచమ్మ ఆలయాల దగ్గరకు వెళ్లినట్లు తెలుస్తొంది. అంతే కాకుండా..ఇటీవల తెలంగాణలో వరుసగా ఆలయాలు ధ్వంసం అవ్వడంపై కూడా అఘోరీ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ కు ఈ ఘటనలన్ని తెలిసేజరుగుతున్నాయని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఒక సీఎంగా గొడవల్ని, విగ్రహాల ధ్వంసాలను ఆపే పొజిషన్ లో ఉండి.. రేవంత్ వీటిని పట్టించుకొవడంలేదని కూడా.. అఘోరీ మండిపడినట్లు తెలుస్తొంది. తనపై లేనీ పోని అభాండాలు వేస్తున్నారని, రాజకీయాలు అంటగడుతున్నారన్నారు. మరో వైపు లేడీ అఘోరీ మాత్రం.. ఒక షాకింగ్ విషయం చెప్పినట్లు తెలుస్తొంది. సీఎం రేవంత్ రెడ్డి తొందరలోనే అనుకొని విధంగా చిక్కుల్లొ పడబోతున్నారన్నారు. అంతే కాకుండా.. ఆయన దీన్ని ఎదుర్కొనేందుకు చాలా ఇబ్బందులు పడుతారన్నారు.
కొంత మంది తనను ఫెక్ అఘోరీ అంటున్నారని, అలాంటి వాళ్లను తాను పట్టించుకొనని, నాకు విల్లా ఉందని ఆరోపణలు చేస్తున్నారని.. ఈ ఆరోపణల్ని ప్రభుత్వంకు దమ్ముంటే నిరూపించాలని కూడా లేడీ అఘోరీ సవాల్ విసిరారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం లేడీ అఘోరీ మాత్రం.. మన దేవుళ్లను, అమ్మాయిల్ని, మహిళల్ని కాపాడుకొవాలని కూడా అందరికి పిలుపు నిచ్చినట్లు తెలుస్తొంద.
తనపైనిఘా పెట్టడం కాదని.. గుళ్లపై, మహిళలపైదాడులు జరగకుండా నిఘా పెంచాలని కూడా అఘోరీ ఇన్ డైరెక్ట్ గా సవాల్ విసిరినట్లు తెలుస్తొంది. తన సనాతన ధర్మం జోలికి లేదా ఆడవాళ్ల జోలికి వెళ్లేవారిని, అత్యాచారాలకు పాల్పడే వారికి కఠినమైన పనిష్మెంట్ ఉంటుందని కూడా లేడీ అఘోరీ అన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.