ఏపీ ప్రతిపక్షనేత మరియు వైసీపీ పార్టీ వ్యవస్థాపకుడు వై యస్ జగన్మోహన్ రెడ్డికి,  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ట్విట్టర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందేశానికి స్పందించిన జగన్, ట్విట్టర్ ద్వారా చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'వైఎస్‌ జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని భగవంతుడిని కోరుకుంటున్నా' అన్న చంద్రబాబు సందేశానికి బదులుగా 'ప్లజెంట్‌ సర్‌ప్రైజ్‌ అండి. థ్యాంక్యూ' అంటూ కృతజ్ఞతలు తెలిపారు జగన్. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా పర్యటనలో ఉన్న  జగన్ తన పుట్టినరోజు వేడుకలను అనంతపురం జల్లా నల్లమడకు భారీగా తరలివచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తల నడుమ జరుపుకున్నారు.