రామతీర్ధం ఘటనపై సీఐడీ విచారణ ప్రారంభమైంది. సీఐడీ అడిషనల్ డీజీ సునీల్ కుమార్ రామతీర్ఘం బొడుకొండను పరిశీలించారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కల్గించిన రామతీర్ధం ఆలయ ఘటన ( Ramatheertham Temple Incident )పై ఏపీ ప్రభుత్వం ( Ap Government ) సీరియస్ అయింది. సీఐడీ విచారణ ( CID Investigation )కు ఆదేశించింది. డిసెంబర్ 28 రాత్రి గుర్తు తెలియని దుండగులు రామతీర్ధం ఆలయంలోని రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.  


ప్రభుత్వ ఆదేశాల మేరకు విచారణ ప్రారంభించిన సీఐడీ డీజీ సునీల్ కుమార్..సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. ఘటన జరిగిన విధానం చూస్తుంటే ఎవరో కావాలని చేసినట్టుగా ఉందని అడిషల్ డీజీ సునీల్ కుమార్ ( CID Additional DG Sunil kumar ) తెలిపారు. రాజకీయ లబ్ది, ప్రభుత్వంపై కక్షతోనే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని స్పష్టం చేశారు.


రాముడి విగ్రహం ధ్వంసం చేసేందుకు ఉపయోగించిన రంపం ఘటనా ప్రాంతంలో లభించిందని..దాంతో పాటు ఇతర ఆధారాలు చాలా లభించాయని వెల్లడించారు ఆలయంలో ఉన్న ఆభరణాలు గానీ, వస్తువులు గానీ దొంగతనం జరగలేదని..రాజకీయాలు చేసేందుకే ఈ ఘటనకు పాల్పడినట్టుగా ఉందన్నారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుగుతుందని..దోషుల్ని త్వరలో పట్టుకుంటామన్నారు. 


Also read: AP: ప్రతిపక్షాలు ప్రమాదకర రాజకీయాలు చేస్తున్నాయి: వైసీపీ నేత సజ్జల


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook