AP: ప్రతిపక్షాలు ప్రమాదకర రాజకీయాలు చేస్తున్నాయి: వైసీపీ నేత సజ్జల

AP: దేవాలయాలపై జరుగుతున్న దాడులు..ప్రతిపక్షాల రాజకీయాలపై వైఎస్సార్  కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ప్రతిపక్షాలు మతాలతో ఆడుకుంటూ..ప్రమాదకర రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించింది.

Last Updated : Jan 5, 2021, 08:44 PM IST
  • రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు, ప్రతిపక్షాల రాజకీయంపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పందన
  • ప్రతిపక్షాలు ప్రమాదకర రాజకీయాలు చేస్తున్నాయని విమర్శ
  • దేవుడి విగ్రహాలు పగలగొడితే ఎవరికి ప్రయోజనమని ప్రశ్న
AP: ప్రతిపక్షాలు ప్రమాదకర రాజకీయాలు చేస్తున్నాయి: వైసీపీ నేత సజ్జల

AP: దేవాలయాలపై జరుగుతున్న దాడులు..ప్రతిపక్షాల రాజకీయాలపై వైఎస్సార్  కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ప్రతిపక్షాలు మతాలతో ఆడుకుంటూ..ప్రమాదకర రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించింది.

రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులపై ( Attacks on Hindu Temples ) రాజకీయం చేస్తున్న ప్రతిపక్షాలపై ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ప్రతిపక్షాలు మతాలతో ఆడుకుంటున్నాయని విమర్శించారు. సున్నితమైన అంశాలపై తామెప్పుడూ ఆందోళనలు చేయలేదని..కానీ ప్రతిపక్షాలు మాత్రం ప్రమాదకర రాజకీయాలు చేస్తున్నాయని సజ్జల ధ్వజమెత్తారు. ఎవరూ లేని ప్రాంతాల్లో అర్ధరాత్రి వేళల్లో పథకం ప్రకారం దాడులు చేస్తున్నారని..ఉన్మాద స్థాయిలో ఉన్నవారే విధ్వంసానికి పాల్పడ్డారని ఆరోపించారు. 

చంద్రబాబు ( Chandrababu ) హయాంలో విజయవాడలో ఆలయాల్ని కూల్చేయడం, పుష్కరాల్లో చంద్రబాబు షూటింగ్ కారణంగా 29 మంది చనిపోవడం, సదావర్తి భూముల ఘటనను మర్చిపోయారా అని ప్రశ్నించారు. దేవుడి విగ్రహాల్ని పగలగొడితే ఎవరికి లాభమని నిలదీశారు. 

బీజేపీకు చేరువయ్యేందుకే చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. భవిష్యత్‌లో ఇలాంటి దాడులు జరగకుండా చర్యలు తీసుకుంటామని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ( Ycp leader Sajjala Ramakrishna reddy ) స్పష్టం చేశారు. 

Also read: AP: జనవరి 20 వరకూ ఇళ్ల పట్టాల పంపిణీ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News