AP CID Issues Notice To TDP Chief Chandrababu: ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన సీఐడీ అధికారులు అమరావతి భూముల వ్యవహారంలో నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరుకావాలని నోటీసులలో పేర్కొన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓవైపు సంక్షేమ పథకాలతో తన మార్కు పాలనను అందిస్తున్నారు. అందుకు తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు నిదర్శనంగా నిలిచాయి. మరోవైపు రాష్ట్రంలో గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలలపై ఫోకస్ చేశారు. ఈ నేపథ్యంలో సీఆర్‌డీఏ చైర్మన్ హోదాలో అసైన్డ్ భూముల బదలాయింపు వ్యవహారంలో చంద్రబాబు(Chandrababu Naidu)పై సీఐడీ కేసు నమోదు చేశారు. ఏపీ కేబినెట్ ఆమోదం లేకుండానే అసైన్డ్ భూములను ల్యాండ్ పూలింగ్‌లో చేర్చడంపై ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై 120 బీ, 166, 167, 217, ప్రొహిబిషన్ ఆఫ్ అసైన్డ్ లాండ్యస్ 1977, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద కేసులు నమోదు చేశారు.


Also Read: EPFO: ఆరు నెలల్లో 71.01 లక్షల EPF Accounts క్లోజ్ చేసిన ఈపీఎఫ్‌వో


ఏపీ కేబినెట్ ఆమోదం లేకుండానే ల్యాండ్ పూలింగ్‌లో భూములను చేర్చడం లాంటి ప్రధాన అభియోగాలను టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ సీఐడీ నమోదు చేసింది. అధికారుల అభిప్రాయాలు తీసుకోకుండా వన్‌టైమ్ సెటిల్మెంట్ కింద అసైన్డ్ భూములు(Amaravati Lands) సెటిల్మెంట్ చేశారు. ఈ విషయంలో దళితులు, పలువురు పేదలు తమకు అన్యాయం చేయవద్దని వేడుకున్నా టీడీపీ(TDP) ప్రభుత్వం తమ నిర్ణయాలను అమలు చేసిందని ఆరోపణలున్నాయి.


Also Read: Gold Price Today: మార్కెట్‌లో నేడు స్థిరంగా బంగారం ధరలు, పుంజుకున్న Silver Price


అసైన్డ్ భూములకు ఎలాంటి ప్లాట్లు రావంటూ ప్రచారం చేసి వారిలో మరింత భయాన్ని పెంచారని అప్పట్లో విమర్శలొచ్చాయి. అనంతర కాలంలో రాజధాని పరిసర ప్రాంతాల్లో ఆ సేకరించిన భూములను తక్కువ ధరలకే కొనుగోళ్లు జరిగాయి. పేదలకు, సామాన్యులకు అన్యాయం జరగగా, గతంలో చెప్పినదానికి భిన్నంగా అప్పటి ప్రభుత్వ పెద్దలు ప్లాట్లు సైతం పొందారు. రాజధాని భూముల వ్యవహారంలో చంద్రబాబుకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసి, విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook