RGV Case: రామ్‌గోపాల్ వర్మ తల నరికి తెస్తే కోటి రూపాయలు ఇస్తానంటూ బహిరంగంగా టీవీ ఛానెల్ డిబేట్‌లో ప్రకటించిన టీడీపీ మద్దతుదారుడు కొలికపూడి శ్రీనివాసరావుపై సీఐడీ చర్యలకు ఉపక్రమించింది. జనవరి 3న విచారణకు రావల్సిందిగా కోరుతూ ఆయన ఇంటికి నోటీసులు జారీ చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవల ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అలియాస్ ఆర్జీవీ తలను నరికి తీసుకొస్తే కోటి రూపాయలు ఇస్తానంటూ ఆంద్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు, టీడీపీ మద్దతుదారుడైన కొలికపూడి శ్రీనివాసరావు టీవీ5 ఛానెల్ డిబేట్‌లో బహిరంగంగా ఆఫర్ చేశాడు. ఆర్జీవీ ఫిర్యాదు మేరకు సీఐడీ పోలీసులు శ్రీనివాసరావుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని కొలికపూడి శ్రీనివాసరావు ఇంటికి వెళ్లి అతని భార్యకు నోటీసులు జారీ చేశారు. జనవరి 3వ తేదీన విచారణకు రావల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు. చట్ట ప్రకారం వ్యవహరించాలని ఈ మాటలు వెనక్కి తీసుకోవాలని చానెల్ డిబేట్‌లో కోరుతున్నా..ఐ రిపీట్ ఐ రిపీట్ అంటూ కొలికపూడి రెచ్చిపోవడం స్పష్టంగా ఉంది. 


ఈ వ్యవహారంపై కొలికపూడి శ్రీనివాసరావు, టీవీ 5 యాంకర్ సాంబశివరావు, టీవీ 5 ఛైర్మన్ నాయుడు ముగ్గురిపై చర్యలు తీసుకోవాలని ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఏపీ డీజీపీకు ఫిర్యాదు చేశారు. తనను చంపి తల తీసుకొచ్చినవారికి కోటి రూపాయలు ఇస్తానని బహిరంగంగా ఆఫర్ చేశాడని, అంతేకాకుండా తన ఇంటికొచ్చి తనను తగలబెడతానని హెచ్చరించాడని ఆర్జీవీ ఫిర్యాదులో ఉంది. 


Also read: Alla Ramakrishna Reddy: నా సర్వస్వం పోగొట్టుకున్నా.. వైఎస్ షర్మిల వెంట నడుస్తా.. ఆళ్ల రామకృష్ణారెడ్డి హాట్ కామెంట్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook