Ap CM Chandrababu naidu visita tirumala: ఆంధ్రప్రదేశ్ ప్రజలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి  చరిత్రలో లిఖించదగ్గ విజయం అందించారు. ఈ నేపథ్యంలో నిన్న (బుధవారం) ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం వేడుక కేసర పల్లిలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సినిమారంగం, రాజకీయ రంగాల నుంచి ప్రముఖులు హజరయ్యారు. ఇదిలా ఉండగా.. దేశ ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డా, వెంకయ్య నాయుడు, కేంద్రమంత్రులు, బండి సంజయ్, రజీనీకాంత్, చిరంజీవీ, రామ్‌ చరణ్, మాజీ జస్టిస్ ఎన్వీరమణ, తమిళి సై, మొదలైన అతీరథ మహారథులు హజరయ్యారు. ఇదిలా ఉండగా.. చంద్రబాబు ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ఆద్యంతం ఎమోషనల్ సన్నివేశాలు చోటు చేసుకున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read more: Prewedding shoot: ప్రీవెడ్డింగ్ షూట్ లో తాత హల్ చల్.. కొత్త జంటకు ట్విస్ట్ మాములుగా లేదుగా.. వీడియో వైరల్..


 చిరంజీవిని,పవన్ కళ్యాణ్ లను మోదీ స్టేజీపైకి తీసుకొని రావడం, వారిని ఆలింగనంచేసుకొవడం, చంద్రబాబు.. చిరంజీవి హగ్ చేసుకొవడం, బాలయ్య, తన నారా భువనేశ్వరీనీ ప్రేమతో ముద్దుపెట్టుకొవడం, నడ్డా, గడ్కరీకీ సుపారీ ఇవ్వడం, ఇలా ప్రతి సంఘటన కూడా ఎంతో ఎమోషనల్ గా జరిగాయి. ప్రమాణ స్వీకారం కార్యక్రమం కూడా ఏపీ ప్రజలకు మంచి చేయాలని ఏకైన టార్గెట్ గా బరిలో దిగిన కూటమికి ప్రజలు బ్రహ్మరథంపట్టారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ..చంద్రబాబు, 24 మంది మంత్రులచేత ప్రమాణ స్వీకారం చేయించారు. అదే విధంగా ఈరోజు మంత్రులకు శాఖలను కేటాయించనున్నారు.


ఇక ప్రమాణ స్వీకారం చేశాక.. చంద్రబాబు తన కుటుంబంతో కలిసి శ్రీవారి దర్శనానికి వెళ్లారు. అయితే.. టీటీడీ అధికారులు మాత్రం ప్రోటోకాల్ ను ఫాలో అవ్వడంలో విఫలమయ్యారు. దీంతో చంద్రబాబు తీవ్ర అసహానం వ్యక్తం చేసినట్లు తెలుస్తొంది. చంద్రబాబు తన కుటుంబంతో కలిసి వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చారు. రేణి గుంట విమానశ్రయంలో పార్టీ నేతలు, అధికారులు ఘనస్వాగతం పలికారు. కానీ తిరుమలలోని గాయత్రి నిలయంకు సీఎం వెళ్లినప్పుడు ఆయనను ఎవరు రీసివ్ చేసుకొలేదు.


Read more: Snakes repellent plants: ఈ చెట్లంటే పాములకు ఎంతో భయం.. ఆ ఇళ్లవైపు కన్నేత్తి కూడా చూడవంట..


అంతేకాకుండా...  ఆయన వాహానం దిగిలోపలికి వెళ్లాక చాలాసేపటి తర్వాత మాత్రం.. టీటీడీ ఇన్ చార్జీ ఈవో వీర బ్రహ్మం పుష్పగుచ్చం ఇచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. పుష్పగుచ్చం తీసుకోకుండానే లోపలికి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో టీటీడీ అధికారులు ప్రొటోకాల్ ఉల్లంఘనపై చంద్రబాబు రుసరుసలాడినట్లు తెలుస్తోంది. టీడీపీ నేతలు మాత్రం ఈ ఘటనపై తీవ్రంగా స్పందింస్తున్నారు. నాలుగవ సారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసి తొలిసారి తిరుమలకు వస్తే ఇదేనా మీ ప్రొటోకాల్ అంటూ విమర్శలు చేస్తున్నారు. సీఎం చంద్రబాబుకు అవమానం కలిగేలా టీటీడీ అధికారులు ప్రవర్తించారని టీటీడీ పెద్దలు ఎద్దేవా చేస్తున్నారు. ఈ ఘటనపై చంద్రబాబు కూడా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter