CM JAGAN: ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి ఫలితాలు వివాదస్పదమయ్యాయి. కేవలం 67 శాతం మందే పాస్ కావడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఫెయిల్ అయ్యామనే బాధతో కొందరు విద్యార్థులు సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. ఎస్సెస్సీ ఫలితాలపై విపక్షాలు తీవ్రంగా స్పందించాయి. జగన్ సర్కార్ వైఫల్యం వల్లే ఫలితాలు తగ్గాయని, లక్షలాది మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారని టీడీపీ, జనసేన నేతలు ఆరోపించారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విద్యార్థులతో కలిసి పెద్ద ఉద్యమమే చేశారు. టెన్త్ విద్యార్థులతో లోకేష్ జూమ్ మీటింగ్ నిర్వహిస్తుండగా.. లైవ్ లోకి మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రావడం సంచలనమైంది. టీడీపీ, వైసీపీ మధ్య డైలాగ్ వార్ కు దారి తీసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో పెద్ద రచ్చగా మారిన పదో తరగతి ఫలితాలపై తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. సత్యసాయి పుట్టపర్తిలో జిల్లాలో పర్యటించిన జగన్.. ఖరీప్ సాగుకు సంబంధించిన రైతుల బీమా పరిహారం విడుదల చేశారు. ఈ సందర్భంగా విపక్షాలను టార్గెట్ చేసిన ఏపీ సీఎం జగన్.. పదవి తరగతి ఫలితాలపైనా మాట్లాడారు. కొన్ని పార్టీలు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని మండిపడ్డారు. ఫెయిల్ అయిన విద్యార్థులలో ఆత్మసైర్ధం నింపాల్సింది పోయి.. వాళ్లు ఆత్మహత్యలు చేసుకునేలా కుట్రలు చేశారని సీఎం జగన్ ఆరోపించారు.


పదవ తరగతిలో 67 శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారని సీఎం జగన్ చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లోనూ ఎస్సెస్సీలో 65 శాతం మందే ఉత్తీర్ణులు అయ్యారని తెలిపారు. కాని ఇక్కడి విపక్షాలు మాత్రం రాద్ధాంతం చేశాయని ధ్వజమెత్తారు. తెలుగుదేశం, జనసేన పార్టీల నేతలు పదో తరగతి విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఫెయిల్ అయిన విద్యార్థులు అధైర్యపడవద్దని... నెల రోజుల్లోనే సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. సప్లిమెంటరీలో పాస్‌ అయినా రెగ్యులర్‌గానే పరిగణిస్తామని ప్రకటించారు. సప్లిమెంటరీలో పాస్ అయినవాళ్లు మొదట పాస్ అయిన వాళ్లతో కలిసి ఇంటర్ చేసుకోవచ్చని సీఎం జగన్ వరమిచ్చారు.


Read also: CM JAGAN: చంద్రబాబు, పవన్ తోడు దొంగలు.. కోనసీమలో అల్లర్లు చేయించారు! సీఎం జగన్ హాట్ కామెంట్స్..


Read also: Jagannath Rath Yatra 2022: పూరీ జగన్నాథ రథయాత్ర ఎప్పుడు? దాని విశిష్టత ఏంటి?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి