అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మహమ్మారి నియంత్రణ చర్యల్లో భాగంగా తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తోన్న ఆయా సిబ్బందికి బీమా సౌకర్యం కల్పించాలని ఆంద్రప్రదేశ్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. కరోనా నివారణపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ రాష్ట్రంలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై, కరోనా బీమా పరిధిలోకి ముందువరుసలో ఉన్న వారితో పాటు పారిశుద్ధ్య కార్మికులు, గ్రామ వాలంటీర్లు, ఆశావర్కర్లు, గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులను చేర్చాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో పారిశుద్ధ్యం నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రత్యేక తనిఖీ నిర్వహణను  చేపట్టాలని సూచించారు. అంతేకాకుండా రాష్టంలో కరోనాకు సంబంధించిన అంశాలతో పాటు జనాభా ప్రాతిపదికన ప్రతి 10లక్షల మందికి నిర్వహిస్తోన్న జాబితాలో రాష్ట్రం రెండో స్థానానికి చేరినట్లు సీఎంకు తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: దంత వైద్యశాలలో ప్రసవం


గడిచిన 24 గంటల్లో కరోనా 5400 టెస్టులు నిర్వహించబడ్డాయని, రాజస్థాన్ 685 టెస్టులతో చేస్తుండగా, 539 పరీక్షలతో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉందని తెలిపారు. మరో 3 నుండి 4 రోజుల్లో టెస్టులు చేసే సంఖ్య బాగా పెరుగుతుందని, రోజుకు 17,500కు పైగా టెస్టులు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. రెడ్‌జోన్లకు ముందస్తుగా మాస్కుల పంపిణీ జరగాలని, ప్రతి మనిషికి 3 చొప్పున మాస్కుల పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..