Job Notifications: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 8 వేల పోస్టుల భర్తీకి జగన్ గ్రీన్ సిగ్నల్
Job Notifications: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. త్వరలో భారీగా కొలువులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. జాబ్ క్యాలెండర్ పై సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సీఎం సమీక్షకు వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Job Notifications: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. త్వరలో భారీగా కొలువులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. జాబ్ క్యాలెండర్ పై సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సీఎం సమీక్షకు వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. తమ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను నివేదించారు. జాబ్ క్యాలెండర్ లో భాగంగా ఇంతవరకు భర్తీ చేసిన పోస్టుల వివరాలను సీఎంకు అందించారు అధికారులు. బ్యాక్ లాగ్ పోస్టులు సహా ఏపీపీఎస్సీ పోస్టులపై ప్రత్యేకంగా సమీక్షించారు సీఎం జగన్. వైద్య శాఖ, ఉన్నత విద్య శాఖల్లో ఖాళీల వివరాలు, నియామకాల ప్రక్రియపైనా సీఎం జగన్ చర్చించారు.
గత ఏడాది క్యాలెండర్ ఇయర్ లో 39 వేల654 పోస్టులు భర్తీ చేసినట్లు సీఎంకు అధికారులు వివరించారు. ఇందులో ఒక్క ఆరోగ్యశాఖలోనే 39,310 పోస్టులు ఉన్నాయి. రాష్ట్రంలో గుర్తించిన 47 వేల 465 ఖాళీల్లో 39 వేల పోస్టులు అంటే దాదాపు 83.5 శాతం ఉద్యోగాలు ఒక్క ఏడాదిలోనే భర్తీ చేసినట్లు తెలిపారు. మరో 8వేల నియామకాలు చేపట్టాల్సిన ఉన్నాయని తెలపగా.. వెంటనే ఆ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ఉన్నత విద్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులతో పాటు పోలీసు నియామకాలకు కార్యాచరణ రూపొందించాలని జగన్ ఆదేశించారు. యూనిఫాం ఉద్యోగాల భర్తీకి పక్కా ప్రణాళిక రూపొందించి క్రమం తప్పకుండా భర్తీ చేయాలని ఏపీ ముఖ్యమంత్రి సూచించారు.
ఇక హయ్యర్ ఎడ్యుకేషన్ కు సంబంధించి అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను సెప్టెంబరులోగా భర్తీ చేయాలని అధికారులకు డెడ్ లైన్ పెట్టారు సీఎం జగన్. ఏపీపీఎస్సీ పరిధిలోని ఉద్యోగాలను మార్చిలోగా కంప్లీట్ చేయాలని ఆదేశించారు. గడువులోగా పోస్టులను భర్తీ చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. విద్య, వైద్యానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్న జగన్.. ఆ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేయకపోతే అనుకున్న లక్ష్యాలను సాధించలేమని చెప్పారు. ఉన్నత విద్యలో టీచింగ్ పోస్టుల భర్తీకి పారదర్శకత, సమర్థతకు పెద్దపీట వేయాలని సూచించారు. రెగ్యులర్, కాంట్రాక్టు పోస్టులు అయినా పారదర్శకంగా నియామకాలు ఉండాలన్నారు.
మరోవైపు 1998 డీఎస్సీ అభ్యర్థులకు జగన్ సర్కార్ తీపి కబురు అందించింది. అభ్యర్థుల పోస్టింగులకు సంబంధించి ఫైల్ పై సీఎం జగన్ సంతకం చేశారు. ఇందుకు సంబంధించిన జీవో త్వరలో విడుదల కానుంది. 23 ఏళ్ల తర్వాత తమ సమస్యకు పరిష్కారం లభిస్తుండటంతో 1998 డీఎస్సీ అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Read also: Agnipath Scheme Details: అగ్మిపథ్‌పై ఎందుకీ ఆందోళన, కారణాలేంటి, అగ్నిపథ్ అంటే ఏంటి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.