CM Jagan: ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువ కావాలన్నారు సీఎం జగన్. అక్టోబర్ 2 నాటికి గ్రామాల్లో జగనన్న భూ హక్కు, భూరక్ష సర్వే పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. ఆర్బేకేలు, సచివాలయాలు అక్టోబర్ నాటికి పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీలు డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని తెలిపారు. ప్రభుత్వ స్కూళ్లు, ఆస్పత్రులపై సమర్థ పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. వృద్ధి రేటులో ఏపీ టాప్‌గా నిలవడం సంతోషకరంగా ఉందన్నారు సీఎం జగన్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2021-22లో ఏపీ స్థూల ఉత్పత్తి వృద్ధి రేటు 11.43 శాతంగా ఉందని వెల్లడించారు. ఇది దేశ వృద్ధి రేటు కంటే అధికంగా ఉందన్నారు చెప్పారు. పారదర్శక విధానాలే ఈవృద్ధికి మూల కారణమని ఈసందర్భంగా అధికారులకు వివరించారు సీఎం. స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా పలు శాఖల తీరుపై ఆరా తీశారు. 


విద్య, వైద్యంలో నాడు-నేడు పనుల ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. వైఎస్ఆర్ అర్బన్ క్లీనిక్స్‌, జగనన్న గృహ నిర్మాణ పథకం, ఇళ్ల పట్టాల పంపిణీ, టీడ్కో ఇళ్ల పరిస్థితిపై చర్చించారు. ఉపాధి హామీ పనుల సగటు వేతనం రూ.240 ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రతి రోజూ స్పందన కార్యక్రమం జరగాలన్నారు. దాదాపు 15 వేల సచివాలయాలకు ప్రాధాన్యతా పనుల కోసం రూ.3 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నామన్నారు.


ఆగస్టు 25న నేతన్న నేస్తం అమలు చేయబోతున్నామన్నారు సీఎం జగన్. సెప్టెంబర్ 22న వైఎస్ఆర్‌ చేయూత కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. నిత్యం ప్రజల సమస్యలను ఆర్జీలు తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లాం, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మీ, గృహ నిర్మాణ, గ్రామ వార్డు సచివాలయాల శాఖ స్పెషల్ సీఎస్ అజయ్‌ జైన్‌తోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. 


Also read:Shubman Gill: శుభ్‌మన్‌ గిల్‌పై సర్వత్రా ప్రశంసలు..తాజాగా రోహిత్ శర్మ రికార్డు బద్ధలు..!


Also read:BJP Mla Raja Singh Live Updates: రాజాసింగ్‌పై తెలంగాణవ్యాప్తంగా కేసులు..సస్పెన్షన్‌ వేటు వేసిన బీజేపీ..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి