CM JAGAN: చంద్రబాబు, పవన్ తోడు దొంగలు.. కోనసీమలో అల్లర్లు చేయించారు! సీఎం జగన్ హాట్ కామెంట్స్..
CM JAGAN: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సత్యసాయి పుట్టపర్తి జిల్లాలో పర్యటించారు. చెన్నే కొత్తపల్లిలో పంటల బీమా పరిహారాన్ని లబ్ధిదారులకు అందించారు.ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడిన సీఎం జగన్... విపక్షాలపై విరుచుకుపడ్డారు.టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు.
CM JAGAN: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సత్యసాయి పుట్టపర్తి జిల్లాలో పర్యటించారు. చెన్నే కొత్తపల్లిలో పంటల బీమా పరిహారాన్ని లబ్ధిదారులకుఅందించారు. 2021 ఖరీఫ్ కు సంబంధించి 2 వేల కోట్ల 977 కోట్ల రూపాయల బీమా పరిహారాన్ని బటన్ నొక్కి 15.61 లక్షల మంది అన్నదాతల ఖాతాల్లో జమ చేశారు సీఎం జగన్. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడిన సీఎం జగన్... విపక్షాలపై విరుచుకుపడ్డారు.టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఒక జిల్లాకు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టడాన్ని జీర్ణించుకోలేకపోయారని సీఎం జగన్ అన్నారు. పచ్చని కోనసీమలో అల్లర్లు స్పష్టించారని మండిపడ్డారు. దళిత మంత్రి ఇంటిని తగలబెట్టారని సీఎం జగన్ మండిపడ్డారు.
చంద్రబాబు తానా అంటే ఆయన దత్తపుత్రుడు తందానా అంటున్నారని జగన్ మండిపడ్డారు. ఉన్నది లేనట్లుగా.. లేనిది ఉన్నట్లుగా చేస్తారని చెప్పారు. ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు తోడు దొంగలంటూ హాట్ కామెంట్స్ చేశారు జగన్. తోడు దొంగలైన వీళ్లిద్దరు రాజకీయాల్లో ఉండటానికి అర్హులేనా? అని ఏపీ సీఎం జగన్ ప్రశ్నించారు. క్రాప్ హాలీ డే అంటూ కోనసీమ రైతులను రెచ్చగొడుతున్నారని సీఎం జగన్ ఆరోపించారు. రాష్ట్రంలో చనిపోయిన ప్రతి రైతు కుటుంబాన్ని ఆదుకున్నామని చెప్పారు. పరిహారం అందని ఒక్క కౌలు రైతునైనా చంద్రబాబు, దత్తపుత్రుడు చూపించలేకపోయారని అన్నారు. తాను సవాల్ చేసినా స్పందించలేదని అన్నారు. చంద్రబాబు పాలనలో కౌలు రైతులు దత్తపుత్రుడికి గుర్తురాలేదన్నారు. టీడీపీ ప్రభుత్వంలో చనిపోయిన 458 మంది రైతులకు కూడా పరిహారం ఇచ్చామని చెప్పారు సీఎం జగన్. చంద్రబాబు బకాయిలను తాము చెల్లించినందుకా క్రాప్ హాలీడే అంటూ నిలదీశారు.
ప్రస్తుతం దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుందని ఏపీ సీఎం జగన్ అన్నారు. మూడేళ్లలో సాగుకు ఉచిత కరెంట్ కోసం 25 వేల 800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామన్నారు. అన్నదాతకు మేలు చేసే విషయంలో దేశంతో పోటీ పడుతున్నామన్నారు. గత ప్రభుత్వానికి.. ఈ పాలనకు తేడా గమనించాలని సీఎం జగన్ కోరారు. గతంలో ఇన్సూరెన్స్ ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదన్నారు. అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి మంచి జరుగుతుందన్నారు.
Read also: BJP Leaders Arrest: బీజేపీ నేతలు రాణి రుద్రమ, దరువు ఎల్లన్న అరెస్ట్...
Read also: Mega Recruitment: నిరుద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్.. వచ్చే ఏడాదిన్నరలో 10 లక్షల ఉద్యోగాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి