BJP Leaders Arrest: బీజేపీ నేతలు రాణి రుద్రమ, దరువు ఎల్లన్న అరెస్ట్...

BJP Leaders Rani Rudrama Daruvu Yellanna Arrest: బీజేపీ నేతలు రాణి రుద్రమ, దరువు ఎల్లన్నను హయత్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 14, 2022, 12:46 PM IST
  • ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కించపరిచేలా స్కిట్
  • తాజాగా మరో ఇద్దరు బీజేపీ నేతల అరెస్ట్..?
  • బండి సంజయ్‌కి నోటీసులు జారీ చేసిన పోలీసులు
BJP Leaders Arrest: బీజేపీ నేతలు రాణి రుద్రమ, దరువు ఎల్లన్న అరెస్ట్...

BJP Leaders Rani Rudrama Daruvu Ellanna Arrest: బీజేపీ నేతలు రాణి రుద్రమ, దరువు ఎల్లన్నను హయత్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, ప్రభుత్వ పథకాలను కించపరిచేలా ప్రదర్శించిన స్కిట్ విషయంలో ఈ ఇద్దరి అరెస్ట్ జరిగింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని బండ్లగూడలో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన 'అమరుల యాదిలో.. ఉద్యమ ఆకాంక్షల సాధన సభ'లో ఆ స్కిట్‌ను ప్రదర్శించారు. దీనిపై టీఆర్ఎస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదే కేసులో 4 రోజుల క్రితం బీజేపీ నేత జిట్టా బాలకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా రాణి రుద్రమ, దరువు ఎల్లన్నను అరెస్ట్ చేశారు.  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. తాజా అరెస్టులపై హయత్ నగర్ సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. రాణి రుద్రమ, దరువు ఎల్లన్నలను అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు తెలిపారు. గౌరవనీయ ముఖ్యమంత్రిని కించపరిచేలా స్కిప్ట్ ప్రదర్శించిన కేసులో ఈ ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. విచారణ అనంతరం చర్యలు ఉంటాయని వెల్లడించారు.

Also Read: IND vs SA Dream11 Prediction: అక్షర్, చహల్, అవేశ్ అవుట్.. టీమిండియా తుది జట్టు ఇదే! డ్రీమ్ ఎలెవన్ టీమ్.. 

Also Read: Uric Acid: యూరిక్ యాసిడ్‌ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఇలా చేయండి..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News