Centre Mega Recruitment: నిరుద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఉద్యోగాల భర్తీ విషయంలో విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న వేళ మెగా రిక్రూట్‌మెంట్‌ను ప్రకటించింది. వచ్చే ఏడాదిన్నర కాలంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 10 లక్షల పోస్టులను భర్తీ చేయనుంది. అన్ని ప్రభుత్వ శాఖల్లో మానవ వనరులపై తాజాగా సమీక్ష నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. పీఎంవో ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.
PM @narendramodi reviewed the status of Human Resources in all departments and ministries and instructed that recruitment of 10 lakh people be done by the Government in mission mode in next 1.5 years.
— PMO India (@PMOIndia) June 14, 2022
గత ఫిబ్రవరిలో కేంద్రం రాజ్యసభలో వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది మార్చి నాటికి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ శాఖల్లో 87 లక్షల ఖాళీలు ఉన్నాయి. దశలవారీగా ఈ ఖాళీలను భర్తీ చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే వచ్చే ఏడాదిన్నరలో 10 లక్షల ఉద్యోగాల భర్తీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది.
కాగా, ఇటీవలే తెలంగాణ మంత్రి కేటీఆర్ ఉద్యోగాల భర్తీపై కేంద్ర ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కేంద్రం ఆ హామీని నిలబెట్టుకోలేకపోయిందని కేటీఆర్ మండిపడ్డారు.కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఆయా శాఖల్లో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను కేంద్రం వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేయకపోగా ప్రభుత్వ రంగ సంస్థలను అందినకాడికి అమ్మేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఉద్యోగాల భర్తీ విషయంలో ఇలాంటి విమర్శలకు చెక్ పెట్టేందుకే కేంద్రం ఖాళీల భర్తీ దిశగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read : Covid 19 Today: 50 వేలు దాటిన యాక్టివ్ కేసులు.. దేశంలో కొవిడ్ కల్లోలం?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.