CM Jagan Meet PM Modi: ప్రధాని మోదీతో సీఎం జగన్ ఢిల్లీలో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలు, పెండింగ్‌ సమస్యలపై చర్చించారు. రాష్ట్ర సమస్యలపై ప్రధానికి వినతిపత్రం అందజేశారు. విభజన హామీలు నెరవేర్చాలని మోదీని (PM Modi) కోరారు. విభజన సమయంలో 58 శాతం జనాభా ఏపీకి రాగా.. కేవలం 45 శాతం రెవెన్యూ మాత్రమే దక్కిందన్నారు. 2015-16లో తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం రూ.15,454గా ఉంటే.. ఏపీలో రూ.8,979 మాత్రమే ఉందని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పెండింగ్ బిల్లులను చెల్లించండి...
రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా హామీతో (Ap Special Status) పాటు అనేక హామీలు ఇచ్చారు. ఇప్పటికి చాలా హామీలు పెండింగ్‌లో ఉన్నాయని జగన్.. ప్రధానికి వివరించారు. 2017-18 ధరల సూచీ ప్రకారం పోలవరం అంచనా వ్యయాన్ని రూ.55,657 కోట్లుగా నిర్ణయించి...ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన రూ.2,100 కోట్ల పెండింగ్‌ బిల్లులను మంజూరు చేసేలా ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేయాలని మోదీని జగన్ (AP CM Jagan) కోరారు.2014–15లో చెల్లించాల్సిన బిల్లులను, ఇతర బకాయిలను పరిగణలోకి తీసుకుంటే రెవిన్యూ లోటు (Revenue deficit) రూ.22,948.76 కోట్లకు చేరింది. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది కేవలం రూ.4,117.89 కోట్లు మాత్రమే. పెండింగులో ఉన్న మిగిలిన రూ.18,830.87 కోట్లు చెల్లించి రాష్ట్రానికి అండగా నిలవాలని సీఎం జగన్ కేంద్రాన్ని కోరారు.


Also Read: YS Sharmila reaction on AP party : ఏం అక్కడ పార్టీ పెట్టకూడదా.. అలా అని రూల్ ఉందా? వైఎస్ షర్మిల కామెంట్స్!


రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థలకు ఏపీ జెన్‌కో (AP Genco) విద్యుత్‌ను సరఫరా చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆ విద్యుత్‌ పంపిణీ జరిగింది. దీని కోసం రూ.6,284 కోట్లను చెల్లించాల్సి ఉంది. ఈ విషయాన్ని తెలంగాణ డిస్కంలు కూడా గుర్తించాయి. కాని ఇప్పటివరూ ఎలాంటి చెల్లింపులు చేయలేదు. ఇదే సమయంలో తమ ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి ఏపీ విద్యుత్‌ సంస్థలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయి. ఈ బిల్లులను చెల్లించేలా తగిన ఆదేశాలు ఇవ్వాలని మోదీని కోరారు. మోదీతో భేటీ అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో జగన్‌ భేటీ అయ్యారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook